టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన మూవీ “యశోద”. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో తోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా సమంత ఈ సినిమాల్లో నటించిన నటన ఇప్పటివరకు తన కెరీర్ లో నటించలేదని సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా చూసిన ఎవరైనా సరే మొదటగా చెప్పే మాట ఒకటే.. ఈ సినిమాని సమంత సింగల్ హ్యాండ్ తో ముందుకు తీసుకువచ్చింది . కర్త-కర్మ-క్రియ అన్ని తానై సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పక తప్పదు .
సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాటని అంటున్నారు. మరి ముఖ్యంగా సమంత ఈ సినిమాలో సరో గేట్ మదర్ గా చేసిన పర్ఫామెన్స్ జీవితంలో మర్చిపోలేరు అంటున్నారు సమంత ఫ్యాన్స్ . యశోద సినిమాలో సమంత పర్ఫామెన్స్ చూసి బడాబడా స్టార్స్ కూడా ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం యశోద సినిమాను చూసి సమంత నటనకు ఫిదా అయిపోయారని తెలుస్తుంది .
ఈ క్రమంలోనే యశోద సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సమంతకు పర్సనల్ గా ఫోన్ చేసి మరి ఆమె నటనను మెచ్చుకున్నాడట . “నీలాంటి హీరోయిన్ ఇండస్ట్రీలో లేదు ..వాట్ ఏ పర్ఫామెన్స్.. నీ కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించేసావు.. నిజంగానే హాట్సాఫ్ చాలా బాగా చేశావమ్మా.. కీప్ ఇట్ అప్ ..కంటిన్యూ ..టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ..ఆరోగ్యం జాగ్రత్త ..నువ్వు పూర్తి ఆరోగ్యవంతంగా కోల్కొని త్వరలోనే నా సినిమాలో కూడా ఓ రోల్ చేయాలని కోరుకుంటున్నాను ..నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు” అంటూ చెప్పుకోచ్చారట .
ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఇలా పెద్దరికంగా మాట్లాడి ఇండస్ట్రీకి తానే పెద్ద అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు చిరు. మరోపక్క సమంత ఫ్యాన్స్ అక్కినేని నాగచైతన్యను, నాగార్జున ఏకీపారేస్తున్నారు ..మాజీ కోడలు ఆరోగ్యం బాగో లేకపోయినా ఒక మెసేజ్ లేదు ..మీరు ఇండస్ట్రీ పెద్దలా..? ఇండస్ట్రీలో మీకు గౌరవం ఉందా ..?అంటూ ట్రోల్ చేస్తున్నారు.