ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న.. రీ రిలీజ్ సినిమాలు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇది మరీ పిక్స్ లోకి వెళ్ళింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ జల్సా- బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలు కూడా విడుదల చేశారు. అలా విడుదలైన సినిమాలు అన్నిటికీ అభిమానుల‌ దగ్గర నుంచి మంచి స్పందన రావడంతో మిగిలిన హీరోల సినిమాలు కూడా రీరిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం రీరిలీజ్ సినిమాలు విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అన నటించిన‌ రెండు సినిమాలను రీరిలీజ్ చేశారు. వాటిలో ఒకటి ప్లాప్ సినిమా రెబల్ కాగా ఇంకోటి యావరేజ్ సినిమా బిల్లా.

ప్రభాస్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఫ్లాప్ సినిమాలను విడుదల చేయడం ప‌ట్ల‌ అభిమానులకు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ తెలుగు తెరకు పరిచయమై 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయ‌న‌ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో వర్షం కూడా ఒకటి.. ఇప్పుడు ఈ సినిమాని నవంబర్ 11న భారీ స్థాయిలో రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం కొంతమంది ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు ఏదైనా మాస్‌ సినిమాను విడుదల చేస్తే అభిమానులు సెలెబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుందని తమ అసంతృప్తిని వెలబడుతున్నారు.

NTR: మరో పది రోజుల్లో ఎన్టీఆర్ సినిమా రీ-రిలీజ్.. ఏమిటో తెలుసా? - 10TV Telugu

ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇదే కోవలో వారి అసంతృప్తిని వెలబడుతున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, అదుర్స్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆది సినిమాని నవంబర్ మూడో వారంలో రీరిలీజ్ చేస్తావని ఇప్పటికే ప్రకటించారు ఇక దాంతో అందరూ ఎంతో ఆనందపడ్డారు.. అయితే అనూహ్యంగా ఇప్పుడు ‘బాద్ షా సినిమాని మళ్లీ రీరిలీజ్ చేస్తామని చెబుతున్నారు. ఈ సినిమాను నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ప్రకటించారు. ఈ సినిమా సూపర్ హిట్ చిత్రం అయినప్పటికీ ఈ నిర్ణయం పట్ల ఎన్టీఆర్ అభిమానులు అంత ఆనందంగా లేరు. వారు ఆది- సింహాద్రి సినిమాలను రీరిలీజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లబడుతున్నారు. చేయాలనుకుంటే దీనికి బదులుగా ‘సాంబ’, యమదొంగ వంటి సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest