మ‌హేష్‌కు విల‌న్‌గా ప్ర‌భాస్‌… అబ్బా ఫ్యీజులు ఎగిరిపోయే సినిమా వ‌స్తోంది…!

మన భారతీయ ఇతిహాసాలైన‌ రామాయణం, మహాభారత కావ్యాలు ఎంతో మంచి స్కోప్ ఉన్న సినిమాటిక్
స్టోరీలు. ఈ కావ్యాలను ఇప్పటికే మన తెలుగు సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, సూపర్ కృష్ణ, శోభన్ బాబు, వంటి అగ్ర నటులు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. వారిలో ప్రధానంగా ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ సినిమా మహాభారత ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడుగా మూడు విభిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

Mahesh Babu- Prabhas Mahabharatam

ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని డైలాగ్‌లు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కృష్ణుడి పాత్ర గుర్తు రాగానే మనకి ఎన్టీఆర్ గుర్తొచ్చే విధంగా ఆ పాత్రలో ఆయన అంతలా వదిగిపోయాడు. దుర్యోధనుడి పాత్రలో కూడా ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పటి తరం హీరోలు దర్శకులు కూడా మహాభారత కావ్యాన్ని తెరకెక్కించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో కొందరు దర్శకులు ఇప్పటికే ఈ కావ్యాన్ని సినిమాగా తెరకెక్కించాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు.

మహాభారత కావ్యాన్ని తన కలల ప్రాజెక్టు అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నోసార్లు తన మనసులో మాటను చెప్పాడు. ప్రస్తుతం రాజమౌళి మహాభారత కావ్యాన్ని తెరకెక్కిస్తే ఏ హీరోలతో ఆ కావ్యాన్ని తెరకెక్కిస్తారన్న స‌స్పెన్స్ ఉంది. మన స్టార్ హీరోలు మహాభారతంలో ఉన్న పాత్రలను మన హీరోలు చేస్తే ఎలా ? ఉంటుందన్న‌ ఆలోచనతో పాత్రలకు సంబంధించి ఓ వీడియోని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఆ ఫోటోలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కృష్ణుడు పాత్రలో చూపించాడు. పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ను దుర్యోధనుడు పాత్రలో చూపించారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోలైన రజినీకాంత్, కమలహాసన్ కూడా ఈ సినిమాలో వారికి తగ్గ పాత్రలో చూపించారు. కమలహాసన్ ను భీష్ముడుగా, రజనీకాంత్ ను ద్రోణాచార్యుడుగా ఆ వీడియోలో చూపించాడు. మిగిలిన పాత్రలైనా కర్ణుడు, అర్జునుడు, శకుని వంటి పాత్రల్లో సూర్య, విక్రమ్, కార్తీ వంటి అగ్ర నటులు ఆ పాత్రలో కనిపించారు.

మహాభారతంలో కీలకమైన లేడీ క్యారెక్టర్స్ గా ఉన్న ద్రౌపది, కుంతీదేవి, సుభద్ర వంటి పాత్రలకు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ లైన నయనతార, అనుష్క, ఆసిన్, సమంతా వంటి అగ్ర తారలను ఆ పాత్రలో చూపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తున్నాయి.

Share post:

Latest