టాలీవుడ్ లో ఒకప్పుడు ఎంతగానో స్టార్ హీరోయిన్ గా అలరించిన హీరోయిన్లలో త్రిష కూడ ఒకరు. ఆమె చేసిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తాజగా ‘పోన్నియన్ సెల్వన్ ‘సినిమా అన్ని భాషలలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో నటించిన నటీనటులకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఈ మూవీ తారాగణం అంతా ఇతర ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో త్రిష యువరాణి కుందవై పాత్రలో నటించింది. అంతేకాకుండ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తో పోటీపడి మెప్పించింది.
త్రిష ఇప్పుడు తాజాగా బృందా అనే వెబ్ సెరీస్ లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిసారి త్రిష ఓటీటి లో అడుగు పెట్టబోతోంది.. అభిమానులకు స్వయంగా తన ఇంస్టాగ్రామ్ నుంచి తెలియజేసింది.. త్రిష ఈ ఫోటో లో కనిపిస్తున్నట్లు.. పోలీస్ జీపు కనిపిస్తోంది. దీని అర్థం త్రిష ఒక మఫ్టీ పోలీస్ ఆఫీసర్ల కనిపిస్తోంది.బృందా సీజన్ 1 పూర్తయిందని టైటిల్ పాత్రధారి త్రిష ప్రకటించారు. ఫోటోతో పాటు క్యాప్షన్ ఇలా ఉంది. బృందా సీజన్1 కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు… అని రాశారు.
ఈ క్యాప్షన్ చూడగానే అభిమానులకు కాస్త ఊరటం ఇచ్చింది. మిమ్మల్ని చూసేందుకు తెలుగు ప్రజలు వెయిట్ చుస్తున్నారని ఓ అభిమాని వ్యాఖ్యానించారు. మరో అభిమాని త్రిష మీరు ప్రతి సినిమాలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని.. మరొకరు నాకు అత్యంత ఇష్టమైన నటి మీరే మీకంటే గొప్పవారు ఎవరూ లేరని కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ సిరీస్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఇందులో సాయికుమార్, ఆమని, రవీంద్ర విజయ్ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకునిగా సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
/p>