ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నార్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా..జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అక్రమాలు జరిగాయంటూ విమర్శల దాడి చేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గాని, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో గాని టీడీపీ కంటే బెటర్ గా పవన్ ముందుకెళుతున్నారు.
తాజాగా జగనన్న లే కాలనీల్లో అకారమలు జరిగాయని, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి, ఇళ్ల నిర్మాణాల వరకు వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారని పవన్ పోరాటం మొదలుపెట్టారు. అయితే ఈ అంశంపై టీడీపీ మొదట నుంచి ఆరోపణలు చేస్తుంది గాని క్షేత్ర స్థాయిలో పెద్దగా పోరాటాలు చేయలేదు. ఏదో స్థానిక నాయకత్వం మాత్రం కొన్ని రోజులు జగనన్న కాలనీలు వర్షాలకు మునిగిపోయాయని, కొండలు, అడవిల్లో కాలనీలు కడుతున్నారని విమర్శలు మాత్రం చేశారు.
కానీ చంద్రబాబు గాని, అటు లోకేశ్ గాని క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి,అసలు వాస్తవాలని ప్రజలక్ చెప్పలేదు. ఇప్పుడు పవన్ మాత్రం..క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి జగనన్న కాలనీల్లో పర్యటించి, అక్కడ ఎలాంటి అక్రమాలు జరిగాయనేవి చూపించే ప్రయత్నం చేశారు. తాజాగా విజయనగరం జిల్లాలో పవన్ పర్యటించి… జగనన్న ఇళ్లకు భూ సేకరణలోనే భారీ అవినీతి జరిగిందని, రూ.23,500 కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతున్న ప్రభుత్వం.. ఇందులో రూ.15 వేల కోట్లు పక్కదారి పట్టించిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున భూ సేకరణ నిధులను దారి మళ్లించారని అన్నారు. ఎకరం రూ.2-4లక్షలకే కొనుగోలు చేసి.. రూ.18 లక్షల నుంచి 30 లక్షల వరకు కొన్నట్లు చూపారని, ప్రజాధనం కొల్లగొట్టేశారని, కేంద్రం ఒక్కో ఇంటికి అందించిన రూ.1.80 లక్షలను రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కట్టకుండానే ఇతర పనులకు వినియోగించారని చెప్పారు. ఇలా అసలు అంశాలని హైలైట్ చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు.