ఘట్టమనేని కోడలికి బిగ్ షాక్..ఆమె పై పోలీస్ కేస్..పవిత్రా లోకేష్ మరో డేరింగ్ స్టెప్..!!

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేరు ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. ఆమె సీనియర్ హీరో నరేష్ తో కొనసాగిస్తున్న బంధం గురించి కొందరు జనాలు నెట్టింట పవిత్రను హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు. వాళ్ళ బంధాన్ని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. అంతేకాదు రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ మరణించిన మూమెంట్లో నరేష్ ప్రవర్తించిన తీరు బాగోలేదని .. అసలు పవిత్ర లోకేష్ ను అక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని..? నరేష్ పై మండిపడ్డారు.

అంతేకాదు పవిత్ర లోకేష్ ని మధ్యలోకి లాగుతూ ఆమెపై అసభ్యకరంగా కామెంట్స్ చేసి ఫొటోస్ మార్ఫ్ చేసి ఆమెను మానసికంగా టార్చర్ చేశారు . ఈ క్రమంలోనే ఓపిక నశించిన పవిత్ర లోకేష్ అలా తనపై తన ప్రైవసి కి భంగం కలిగించిన యూట్యూబ్ ఛానల్స్ పై, వెబ్సైట్స్ పై కేసు పెట్టింది . తాగా ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అయితే ఇలా తనపై కావాలని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేయించిందని పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారట .

రమ్య – నరేష్ ల మధ్య కుటుంబ తగాదాలు ఉన్న సంగతి తెలిసిందే . గతంలో రమ్య రఘుపతి పై పోలీస్ కేసు కూడా నమోదు అయినట్లు తెలుస్తుంది. కాగా ఈ కారణంగానే రమ్య రఘుపతి ..పవిత్రా వ్యక్తిగత జీవితం పై అసభ్యకరమైన కామెంట్లు చేయించేలా పలు యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డం పెట్టుకుని ..ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని.. పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారట . అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ వెనక రమ్య రఘుపతి హస్తం ఉందన్నది ఆమె అనుమానం వ్యక్తం చేశారట. దీంతో పోలీసులు క్షుణ్ణంగా ఈ కేసును విచారిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒకప్పుడు ఘట్టమనేని కోడలుగా పేరు సంపాదించుకున్న రమ్య రఘుపతిఇలాంటి దారుణమైన పనులు చేస్తుందా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు పవిత్ర లోకేష్ అడుగు ముందుకేసి ఇలాంటి డేరింగ్ స్టెప్ వేయడం కరెక్టే అంటూ కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

Share post:

Latest