ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోని నటీనటుల సైతం సడన్ గా వివాహాలు చేసుకుని ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా కోలీవుడ్లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన జంట గౌతం కార్తీక్ ,మంజిమా మోహన్. వీరిద్దరూ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. Of అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ. వీరిద్దరి కుటుంబ అంగీకార ప్రకారమే ఈ రోజున వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇరువురు కుటుంబాల సమక్షంలో చెన్నైలో వీరి వివాహం ఒక హోటల్లో చాలా గ్రాండ్గా జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సిని పరిశ్రమకు చెందిన కొంతమంది సెలబ్రిటీలు ఈ వేడుకలు పాల్గొని ఇ యువ జంటను అభినందించినట్లుగా తెలుస్తోంది. పట్టు వస్త్రాలలో మెరిసిపోతున్న ఈ జోడి కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు వీరిద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. దేవరట్టం సినిమా కోసం మంజీమా, గౌత మ్ ఇద్దరూ కూడా కలిసి పని చేయడం జరిగింది.ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా సమాచారం.
ఇక గతంలో తానే మొదట మంజిమా మాకు ప్రపోజ్ చేశానని గౌతమ్ తెలియజేయడం జరిగింది. సుమారుగా వీరిద్దరూ కలిసి మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు ఇక మంజిమా, నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంతో పాటు, కడలి చిత్రంతో నటుడు గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక పెళ్లి దుస్తులను వీరిద్దరూ చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారని నెటిజన్ సైతం తెలియజేస్తూ ఉన్నారు.
View this post on Instagram