ఆ రోజు జరిగింది ఇదే..అసహ్యం వేసింది..కరాటే కళ్యాణిపై పావలా శ్యామల సంచలన వ్యాఖ్యలు..!!

పావలా శ్యామల.. ఈ పేరు చెప్పగానే జనాలకి ఓ రూపం స్ట్రైక్ అవుతుంది. ఖడ్గం సినిమాలో సంగీత అమ్మగా నటించిన మల్టీ టాలెంటెడ్ ఆవిడే ఈ పావల శ్యామల. పేరుకి పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయినా సినిమాలో తన నటనతో ఎంతోమందిని కడుపుబ్బ నవ్వించింది . హీరో హీరోయిన్ల కి తల్లిగా.. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన స్టైల్ లో జనాలను నవ్వించి అలరించిన పావలా శ్యామల.. ప్రస్తుతం దారుణమైన పొజిషన్లో ఉంది .

కాగా ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియని పావలా శ్యామలను వెలుగులోకి తీసుకొచ్చింది కరాటే కళ్యాణి . కరోనా లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందులను జనాలకు తెలిసేలా చేసింది . ఈ సందర్భంగా కరాటే కళ్యాణి ఆమెకు చేతనైన సహాయం చేసి ..మిగిలిన వాళ్ళ చేత కూడా సహాయం అందుకునేలా చేసింది . కానీ ఆ తర్వాత కరాటే కళ్యాణి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . “ఆమెకు సహాయం చేయడానికి వెళ్తే డబ్బులు ఇంత కావాలని డిమాండ్ చేసేదని ..అంతేకాకుండా ఆమె ఇల్లంతా దుర్వాసన వచ్చేదని.. ఇంట్లో కొంచెం సేపు కూడా కూర్చోలేకపోయామని “చెప్పుకొచ్చారు.

కాగా తాజాగా ఇదే వ్యాఖ్యలపై పావల శ్యామల కౌంటర్ వేసింది. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల మాట్లాడుతూ..” కరాటే కళ్యాణి పై సంచలన కామెంట్స్ చేసింది . ఎవరో చెప్పారని నాకు సహాయం చేయడానికి వచ్చిన కరాటే కళ్యాణి నా ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అంటూ మీడియా ముందు చెప్పడం నాకు చాలా అసహ్యంగా అనిపించింది. అలాంటి ఆవిడ దగ్గర నేను సహాయం తీసుకున్నాను అంటూ నాపై నాకే చిరాకేసింది . ఆ సహాయం తీసుకోకూడదు అనుకున్నాను. కానీ నాకు గతిలేక ఆ డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు నా కూతురు మంచాన ఉంది నా పొజిషన్ బాగాలేదు. చేతిలో ఒక్క రూపాయి లేదు ..ఇలాంటి టైం లో నేను ఏమి చేయలేక ఆమె డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె నా ఇల్లు శుభ్రంగా లేదని చెప్పడం మాత్రం నాకు నచ్చలేదు నా పొజిషన్ నా కూతురు పొజిషన్ చూశారు అయినా కానీ ఇలా మాట్లాడుతుంది అని అనుకోలేదు “అంటూ కరాటే కళ్యాణికి ఘాటుగా కౌంటర్ వేసింది. ప్రస్తుతం పావలా శ్యామల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని చెప్పడానికి ఇది మరో ఎగ్జాంపుల్ గా జనాలు చెప్పుకొస్తున్నారు.