అప్పుడు అనసూయ.. ఇప్పుడు శ్యామల.. స్టేజ్ మీదనే పరువు పాయే..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు నోటికి ఎంత మాట వస్తే అంత మాటను ఓపెన్ గానే అనేస్తున్నారు. ఒకప్పుడు ఒక తప్పుడు మాట అనే ముందు కానీ మనం మాట్లాడే మాట ఎదుటివారిని బాధిస్తుందేమో అని కానీ ఆలోచించేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు కూడా హాట్ టాపిక్ అయిన అంశాలను తీసుకొని టైం చూసి కొడుతున్నారు . అలాగే కప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన రాజా రవీంద్ర.. అలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడు.

Telugu Actor Raja Ravindra About Balakrishna

మనకు తెలిసిందే రాజా రవీంద్ర నటుడిగా.. కుర్ర హీరోలకు ..మేనేజర్ గా చిన్న చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉంటూ బాగానే సంపాదించుకున్నాడు. కాగా ఈ మధ్యకాలంలో రాజా రవీంద్ర పలు విభిన్న పాత్రలు పోషిస్తూ తన లోని నటుడిని బయటకు తీసుకొస్తున్నాడు. కాగా తాజాగా ఆయన నటించిన సినిమా తగ్గేదేలే . ఈ సినిమా లో హీరోగా నటిస్తుంది నవీన్ చంద్ర . దండుపాళ్యం సినిమా తీసిన శ్రీనివాసరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా విడుదలవుతుంది .

ఈ క్రమంలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సింపుల్ గా ఫినిష్ చేశారు . రవీంద్ర మాట్లాడుతూ ..”సినిమా యూనిట్ కి ..సినిమాలో నటించిన నటీనటులకి ..ప్రత్యేక ధన్యవాదాలు చెప్పకు వచ్చారు. అంతేకాదు ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని .. కరోనాలో ఎంతో కష్టపడి సినిమాను తీశామని ..నిర్మాతలు మా అందరిని ఎంతో బాగా చూసుకున్నారని.. అందరికీ కూడా ముందే పేమెంట్స్ ఇచ్చేసారని వ్యాక్సినేషన్ చేయించి మరి సొంత మనుషులా ట్రీట్ చేశారని చెప్పుకొచ్చారు . అంతవరకు బాగానే ఉంది. స్పీచ్ అంతా ముగిసిన తర్వాత ఆ ఈవెంట్ కు పోస్టుగా చేస్తున్న యాంకర్ శ్యామలను ఆంటీ అంటూ సంభోదించాడు .

దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలు షాక్ అయిపోయారు . అంతేకాదు యాంకర్ శ్యామల కూడా సైలెంట్ గా నేను ఆంటీని అయితే మీరు తాతని అంటూ కౌంటర్ వేసింది . అయితే ఈ మధ్యకాలంలో అనసూయను అనుకొందరు ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే . ఇప్పుడు పబ్లిక్ గానే స్టేజ్ పైన రాజా రవీంద్ర శ్యామలను ఆంటీ అనడంతో మరోసారి అనసూయ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఏది ఏమైనా సరే చదువుకొని స్టార్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఆడవాళ్ళను తక్కువ చేసిగా మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు మహిళలు . చూద్దాం ఇకనైనా ఇలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారో లేదో..?

Share post:

Latest