చ‌ర‌ణ్ కోసం ఎన్టీఆర్ భారీ త్యాగం.. ఇది అస‌లైన స్నేహ‌మంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు చరణ్ కోసం ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ భారీ త్యాగం చేశాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

త‌న 16 చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఏ దర్శకుడుతో చేయబోతున్నాడు అన్న‌ది ఆసక్తికరంగా మారగా.. `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది. నిజానికి బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ తో చేయాలని భావించాడు. ఆయనకు ఒక కథ చెప్పి సినిమా చేసేందుకు ఒప్పించాడు. `ఎన్టీఆర్ 30` పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించాలని ఎన్టీఆర్ భావించాడు.

అయితే రీసెంట్గా చరణ్ ఎన్టీఆర్ ను కలిశాడట. ఆ సమయంలో ఆర్సీ 16 సినిమా ప్రస్తావన రాగా.. బుజ్జిబాబు తనకు చెప్పిన స్టోరీ లైన్ ను ఎన్టీఆర్ చరణ్‌కు వినిపించాడట. అది విని చ‌ర‌ణ్ ఎంతో ఎక్సైట్ అయ్యాడట. దాంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు చెప్పిన కథ తనకు ఎంతో నచ్చినప్పటికీ చరణ్ కు ఇచ్చేశాడట. ఆ స్టోరీ నాకంటే కూడా నీకే బాగా సూట్ అవుతుందని ఎన్టీఆర్ చెప్పడంతో చరణ్ వెంటనే బుజ్జి బాబును పిలిపించుకుని పూర్తి కథ విన్నాడట. అది ఆయనకు బాగా న‌చ్చి వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. దీంతో ఎన్టీఆర్ నిజంగా గ్రేట్ అని, స్నేహం అంటే వీరిదే అని అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

Share post:

Latest