పిక్ టాక్‌: అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్‌.. ఏమున్నాడురా బాబు!

సినిమా సినిమాకు లుక్‌ పరంగా వేరియేషన్స్ చూపించే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన నుంచి చివరగా వచ్చిన `ఆర్ఆర్ఆర్` చిత్రంలోనూ డిఫరెంట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ తన తదుపరి చిత్రమైన `ఎన్టీఆర్ 30` కోసం సిద్ధం అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించ‌నున్న‌ ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. పాపులర్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఎన్టీఆర్ తాజా లుక్ ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు. `న్యూ లుక్.. న్యూ వైబ్‌` అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దాంతో ఆలిమ్ షేర్ చేసి ఫోటో క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ లుక్ నిజంగానే అదిరిపోయింది. డెనిమ్ షర్ట్ మరియు బ్లాక్ గ్లాసెస్ ఎన్టీఆర్‌ను మరింత స్టైలిష్ గా చూపించాయి. ఇక అభిమానులు అయితే `ఏమున్నాడురా బాబు` అంటూ త‌మ హీరోను చూసి మురిసిపోతున్నారు.

అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక కొంద‌రికి పదేళ్ల క్రితం నాటి `బాద్ షా` లుక్ ని గుర్తు చేస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్ పిక్‌ మాత్రం సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుంది. అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ అయిన త‌దుప‌రి సినిమా కోసమా..? లేక ఏదైనా యాడ్ షూట్ కోసమా అన్నది తెలియాల్సి ఉంది.

Share post:

Latest