టాలీవుడ్ లో యంగ్ హీరోలలో హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇక రీసెంట్ గా విడుదలైన కార్తికేయ-2 చిత్రం విడుదలైన ప్రతి చోట సక్సెస్ కావడమే కాకుండా భారీగా కలెక్షన్లు రాబట్టింది. నిఖిల్ ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగానే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ముఖ్యమైన వాటి పైన ప్రశ్నిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఒక బాలీవుడ్ నటి పైన ఫైర్ అవ్వడం జరిగింది.వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బాలీవుడ్ నటి రీచా ఇటీవల ఇండియన్ ఆర్మీ ని ఉద్దేశిస్తూ గల్వాన్ హాయ్ చెబుతోంది అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ కు సంబంధించి ఈమె పైన పలు రకాల విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈమె పైన పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడ అమే ట్వీట్ ను కూడా తప్పు పట్టడం జరిగింది. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఆమె పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పుడు తాజాగా యంగ్ హీరో నిఖిల్ సైతం రిచా పైన సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా నిఖిల్, రిచా ట్వీట్ పైన స్పందిస్తూ.. 20 మంది భారతీయ సైనికులు గాల్వాన్ వద్ద తమ ప్రాణాలను అర్పించారు. దేశాన్ని మన ప్రాణాలను రక్షించారు వారి త్యాగం గురించి వింటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి. రాజకీయాలను మరచి మనం సైన్యం సాయుధ దళాలను ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలని ఫైర్ అయ్యారు. రీచా దయచేసి దేశం తర్వాత ఏదైనా అని తెలుసుకోండి అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది.
20 Brave Indian soldiers gave up their lives at Galwan protecting our country and us.
Reading about their Ultimate Sacrifice still brings tears to our eyes.
FORGET POLITICS.
Our Army and the Armed forces should always be respected and never insulted. @RichaChadha plz #IndiaFirst pic.twitter.com/SZvaOtKMEv— Nikhil Siddhartha (@actor_Nikhil) November 24, 2022