పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా `ఆదిపురుష్` అనే సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఈ మాథలాజికల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను బయటకు వదలగా.. దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. డార్లింగ్ ఫాన్స్ సైతం టీజర్ పై పెదవి విరిచారు. డైరెక్టర్ ఓం రౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో మేకర్స్ ఆదిపురుష్ విడుదలను జనవరి నుంచి జూన్ కు వాయిదా వేసి దిద్దుపాటు చర్యలు చేపట్టారు.
అయితే తాజాగా ఈ సినిమాపై మరో షాకింగ్ బజ్ నెలకుంది. అదేంటంటే ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ కూడా విడుదల అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. 2024 ఆరంభంలోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బెటర్ విజువల్స్ తో రావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ కారణంగానే విడుదల మరింత ఆలస్యం అవుతుందని టాక్ నడుస్తోంది. దీంతో ఈ ప్రచారం పట్ల డార్లింగ్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ కోసం ఇంకో ఏడాది ఆగాలా అంటూ తలపట్టుకుంటున్నారు.