`ఎన్‌బీకే 108`పై న‌యా అప్డేట్‌.. బాల‌య్య స్పీడుకు బ్రేకుల్లేవ్‌!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. బాలయ్య కెరీర్‌లో 107వ‌ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఈ మూవీ అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. `ఎన్‌బీకే108` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్క‌బోయే ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారిపాటి నిర్మించ‌నున్నారు. తండ్రి-కూతురు మ‌ధ్య ఈ మూవీ కథ‌ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీ‌లీల ఎంపిక అయింది.

అలాగే హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న‌యా అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా లాంఛింగ్ కోసం మేక‌ర్స్ డేట్‌ లాక్ చేశారట. వచ్చే నెల డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంఛ్‌ చేసి.. సంక్రాంతి త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రాబోతుందట. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాలయ్య కెరీర్ పరంగా బ్రేకుల్లేని స్పీడుతో దూసుకుపోతున్నారు.

Share post:

Latest