పోలీసుల `కస్టడీ`లో నాగ‌చైత‌న్య‌.. పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్నాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `మానడు` ఫ్రేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకు 22వ ప్రాజెక్టు ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.

అరవింద స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు నాగచైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి `కస్టడీ` అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్ ను ఖరారు చేశారు.

అలాగే కొందరు పోలీసులు నాగచైతన్య చుట్టూ చెరి గ‌న్స్ పట్టుకుని.. అతన్ని అతి కష్టం మీద కస్టడీలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ నెట్టింట‌ వైరల్ గా మారింది. మొత్తానికి ఫస్ట్ లుక్ ను చూస్తుంటే నాగచైతన్య ఈసారి ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. కాగా, నాగ చైత‌న్య ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. మరి అది కానిస్టేబుల్ పాత్రలోనా? లేక‌ పెద్ద ఆఫీసర్ పాత్రలోనా అనేది తెలియాల్సి ఉంది.

Share post:

Latest