ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే ఆమె భర్త విద్యా సాగర్ కరోనా కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు. ఆమె భర్త మరణించడంతో ఎంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటోంది. ఆ బాధను మర్చిపోవడం కోసం షూటింగ్స్‌కి కూడా వెళ్తుంది. ప్రస్తుతం మీనా వయసు 46 ఏళ్లు. మీనా భర్త చనిపోవడంతో ఆమెని రెండో పెళ్లి చేసుకోమని ఆమె తల్లితండ్రులు బలవంతం చేస్తున్నారట.
‘నీకు ఒక తోడు ఉండాలన్నా, నీ కూతురి భవిష్యత్తు బాగుండాలన్నా.. నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిది” అని సూచిస్తున్నారట. కానీ మీనాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అసలు లేదట. అయినా కూడా మీనా కుటుంబ సభ్యులు మాత్రమే ఆమెని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని సమాచారం. దాంతో మీనా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఒకరిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.
2009లో మీనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే విద్యా సాగర్ ని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కరోనా నుంచి రికవరీ అయిన కొన్నిరోజుల తరువాత విద్యా సాగర్ జూన్ 28 అనారోగ్యంతో కన్నుమూసారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది మీనా. వీరికి 6 సంవత్సరాల ఒక పాప కూడా ఉంది. మీనాకు ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా, విద్యా సాగర్ మరణం ఆమెను కుంగదీసింది. దాంతో రెండో పెళ్లి చేసుకోమని ఆమెని బలవంత పెట్టడంతో తప్పని పరిస్థితులో మీనా రెండో పెళ్ళికి ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.