వీకెండ్ లంచ్ ఇకపై ఎప్పట్లా ఉండదు.. సితార ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

తెలుగు చిత్ర సీమలో దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ నిన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో మహాప్రస్థానంలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఇంట్లో కాకుండా ఆయన కూతుళ్ళ దగ్గర లేదా నరేష్ వద్ద ఫామ్ హౌస్ లో ఉండే వారిని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి వీకెండ్ పిల్లలతో పాటు మహేష్ తన తండ్రి వద్దకు వెళ్లేవారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే చోటున‌ కూర్చుని లంచ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు.

Krishna Garu's Funeral: Mahesh Babu Cries Inconsolably As He Pays His Last Respect To His Father

మహేష్ హైదరాబాద్‌లో ఉంటే ఎన్ని పనులు ఉన్నా వీకెండ్‌లో కృష్ణ వద్దకు కచ్చితంగా వెళ్లేవారు. మహేష్ బాబు కూతురు, కొడుకు గౌతమ్- సీతారాలు తాతగారు కృష్ణతో ఎంతో సరదాగా గడిపేవారు వారికి కృష్ణ గారితో ఎంతో మంచి అనుబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే కృష్ణ‌ మరణించడంతో ఆయన లేరన్న విషయాన్ని వారు జీర్ణించుకో లేక పోతున్నారు. ఆయన జ్ఞాపకాలని తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తాతయ్య మరణాన్ని తలుచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.

mahesh daughter sithara shares an emotional post on krishna death

”వీకెండ్ లంచ్ ఇకపై ఎప్పటికీ మునుపటిలా ఉండదు. మీరు ఎన్నో విలువైన విషయాలు మాకు నేర్పారు. నన్ను ఎంతగానో నవ్వించారు. ఇప్పుడవన్నీ మా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీరు నా హీరో. మీరు గర్వపడేలా ఒకరోజు నేను చేస్తానని నాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని నేను ఎంతగానో మిస్ అవుతున్నాను తాతగారు”.. అని సితార ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. కృష్ణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు చిత్ర పరిశ్రమంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది.

Share post:

Latest