గుడివాడ కొడాలి నాని ఓ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసాడంటే మీరు నమ్ముతారా?

ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని గురించి అందరికీ తెల్సిందే. నిరంతరం తమ ప్రత్యర్థి అయినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగే ఈ మంత్రి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి డిస్ట్రిబ్యూట్ గా వ్యవహరించాడు అంటే మీరు నమ్ముతారా? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తున్నాడో జనాలకి తెలియని విషయం కాదు. నిర్మాతలు పవన్ తో సినిమా కోసం సంవత్సరాలు తరబడి వేచి చూస్తూ వుంటారు.

అసలు విషయానికొస్తే మాజీ మంత్రి కొడాలి నాని.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానట. ఇక కొడాలి నాని రాజకీయాల్లోకి రాకముందు మూవీ డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా వ్యవహరించేవారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాను కృష్ణా జిల్లాలో విడుదల చేసారట. కాగా ఈ వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఆ సినిమా మరేమిటో కాదు, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాని కొనుగోలు చేశారట. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సందడి చేసిందో తెలియంది కాదు.

ఆ సమయంలో కృష్ణాజిల్లాలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా జల్సా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసిన సంగతి విదితమే. ఇక కాలక్రమంలో నిర్మాతగా మారి కొడాలి నాని జూ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను నిర్మించారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను హీరోగా అభిమానించిన నేతలు అనేకమంది ఇపుడు వైసీపీలో ఉన్నారట. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, కోడలి నాని, కురసాల కన్నబాబు వంటి వారు పవన్ కళ్యాణ్ భక్తులేనట. అయితే ప్రస్తుతం రాజకీయాల వలన విమర్శించాల్సి వస్తుందని వారు వారి సన్నిహితులదగ్గర విన్నవించుకున్నట్టు వినికిడి.

Share post:

Latest