కృష్ణ Vs కృష్ణం రాజు: దినం భోజనాల గోల .. బుద్ధి లేదా రా మీకు..?

“మొగుడు చనిపోయి భార్య ఏడుస్తూ ఉంటే.. ఆమె ఎవరో వచ్చి అదేదో అడిగింది” అన్న సామెత లా.. సినీ ఇండస్ట్రీ ఇద్దరు లెజెండ్స్ కోల్పోయింది అన్న బాధలో చిత్ర ప్రముఖులు ..వాళ్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ..మితిమీరిన అభిమానంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు తమ ఫేవరెట్ హీరో దిన భోజనాల గురించి హైలెట్ చేస్తూ ..పక్క హీరో ఫ్యాన్స్ ని బాధపడుతున్నారు . ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మనకు తెలిసింది గత మూడు నెలల వ్యవధిలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు బిగ్ లెజెండ్స్ మృతి చెందారు . టాలీవుడ్ రెబల్ స్టార్ సీనియర్ హీరో కృష్ణం రాజు పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కారణంగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. కాగా ఆయన మరణించిన రెండు నెలలకే రీసెంట్గా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో కృష్ణ అనారోగ్య కారణంగా మృతి చెందారు . ఇలా మూడు నెలల గ్యాప్ లోనే ఇద్దరు లెజెండ్స్ ని కోల్పోయిన బాధలో కుటుంబ సభ్యులు.. వాళ్ళ స్నేహితులు.. ప్రముఖులు బాధపడుతూ ఉంటే వాళ్ల దినం భోజన కార్యక్రమాలు గురించి సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్.


మనకు తెలిసిందే రెబెల్ స్టార్ కృష్ణం రాజు సంస్మరణ సభ మొగల్తూరులో నిర్వహించారు . ఉదయ గోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మందికి పైగా ఫ్యాన్స్ వచ్చి కృష్ణంరాజు పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు . ప్రభాస్ సైతం భోజన విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రాజుల కాలం నాటి భోజనాలను పెట్టి అభిమానులను సాటిస్ఫై చేశారు . కడుపునిండా భోజనం పెట్టి రెబెల్ ఫ్యామిలీ పరువును నిలబెట్టాడు . ఆ నాలుగైదు రోజుల సోషల్ మీడియా మొత్తం కృష్ణంరాజు దినం భోజనాల గురించి మాట్లాడుకున్నారు .

అయితే రీసెంట్ గా హైదరబాదులో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించాడు . .అభిమానుల కోసం విందు ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్‌లో విందు ఏర్పాటుచేసిన సూపర్ స్టార్.. అభిమానులకు జేఆర్సీ కన్వెన్షన్‌ను కేటాయించారు. అక్కడ 32 రకాల వంటకాలతో అభిమానులకు విందు భోజనం ఏర్పాటుచేశారు.అయితే సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ కావాలని కృష్ణం రాజు దినం భోజన ఐటమ్స్ బాగున్నాయని ..సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ భోజనాలు పెద్దగా బాగోలేదని ట్రోల్ చేస్తున్నారు .

ఏది ఏమైనా రెబెల్ ఫ్యామిలీకి ధీటుగా ఘట్టమనేని ఫ్యామిలీ ఎప్పటికీ సరితూగదని అభిమానులు మధ్య వార్ మొదలైంది. ఈ క్రమంలోనే కొందరు రియల్ ఫ్యాన్స్ కుటుంబ పెద్దలను పోగొట్టుకొని వాళ్ళ బాధపడుతుంటే ఇలా సోషల్ మీడియాలో దినం భోజనాల గురించి గోల చేయడం కరెక్టేనా ..?అంటూ మండిపడుతున్నారు. మరికొందరు బుద్ధి లేదా రా ..?మీరు నిజమైన ఫ్యాన్స్ నా..? అంటూ ఫైర్ అవుతున్నారు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ కొంచెం హద్దులు దాటుతున్నారు అన్నది మాత్రం వాస్తవం..!!

Share post:

Latest