టాలీవుడ్ స్టార్ యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . ఒకప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ నిరంతరం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ తన స్పీడ్ ని కాస్త తగ్గించింది. కాగా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను కూడా విడిచిపెట్టింది . దీనికి కారణం కూడా చెప్పుకొచ్చింది అనసూయ . బాడీ షేవింగ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుండడంతోనే ఆ షో నుంచి తప్పుకోవాల్సిన అవసరం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అప్ అయ్యింది.
మల్టీ టాలెంటెడ్ గల అనసూయ ఏ ముహూర్తాన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిందో అప్పటినుంచి అనసూయకు సినిమా అవకాశాలు కూడా తగ్గాయి . ఒకప్పుడు వెండితెర , బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోయిన అనసూయ ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేకుండా చాలా దూరంగా ఉంటుంది. రీసెంట్ గానే తన కుటుంబంతో కలిసి కులదైవ పూజ చేసిన అనసూయ.. మళ్లీ అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఇదే క్రమంలో అనసూయ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో కాంట్రవర్షియల్ కామెంట్స్ ఉన్న కోట్ ని షేర్ చేస్తూ మళ్ళీ వివాదాల్లోకి తలదూర్చింది. ” సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి : అంటూ రాసి ఉన్న ఓ కొటేషన్ ని షేర్ చేస్తూ..” నాకు ఎందుకు కొంతమంది గుర్తొస్తున్నారు” అంటూ రాసుకొచ్చింది. దీంతో అనసూయ కౌంటర్ వేసింది వాళ్లకేనా అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో అనసూయను కొంతమంది ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. నా అనుకున్న వాళ్లు సైతం ఆమెకు అండగా నిలబడకుండా ఆంటీ అంటూ కౌంటర్లు వేశారు. ఏది ఏమైనా సరే ఒకే ఒక్క పోస్టుతో అందరి నోరులు మూతపడేలా చేసింది అనసూయ అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.