తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ మెహ్రిన్. తన మొదటి చిత్రంతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ నుంచి వరుస సినిమాలు అందుకుంటూ దూసుకుపోతోంది.మెహ్రిన్ కెరియర్ లో ఒక మోస్తారు సక్సెస్ అయిన సినిమాలలో ఎఫ్2 ,f3 తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా తన మొహం నిండా సూదులతో మెహ్రిన్ చాలా భయంకరంగా కనిపిస్తోంది.
అయితే అలా ఎందుకు చేసింది ఏమైంది అనే సందేహాలు అభిమానులలో మొదలవుతూ ఉన్నాయి. అదొక ఫేస్ ట్రీట్మెంట్ అన్నట్లుగా తెలుస్తోంది. ఆక్యుపంచర్ లో ఆక్యు స్కిన్ లఫ్ట్ అని ఒక తెరపి చేయించుకుంటున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీనివల్ల ఫేస్ మరింత కాంతివంతంగా తయారవుతుందని తెలుస్తోంది. దీనిని ఎక్కువగా ఏజ్ బార్ అయిన వారు మాత్రమే చేయించుకుంటూ ఉంటారు. కానీ 27 ఏళ్ల వయసులోని మెహ్రిన్ ఎందుకు చేయించుకుంటోంది అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
తనపై వచ్చే కామెంట్లను చూడకూడదని మెహ్రిన్ మెసేజ్ ను డిసేబుల్లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వద్దనే మెహ్రిన్ ఈ ఆకు స్కిన్ లెఫ్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇలా ట్రీట్మెంట్ చేయించుకుంటూ షేర్ చేసిన ఫోటోలను ఆ ట్రీట్మెంట్కు గల కారణాలు తెలియజేస్తే బాగుంటుందని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెహ్రిన్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram