400 ఎకరాలు పోగొట్టుకున్న మాకు.. కృష్ణ చేసిన సహాయం ఇదే.. కాంతారావు కూతురు..!!

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడుగా ఒక వెలుగు వెలిగారు నటుడు కాంతారావు. హీరోగా సహాయ నటుడిగా ఎన్నో రకాల పాత్రలలో నటించి విశేష ప్రేక్షకు ఆదరణ పొందారు. ఆయన ఎంతగానో ఆస్తులు సంపాదించారని కానీ ఆ తర్వాత కాలంలో నిర్మాతగా మారి చాలా నష్టపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే తనకున్న 400 ఎకరాల భూమిని పోగొట్టుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ కాంతారావు కూతురు సుశీలరావు తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కాంతారావు కూతురు సుశీల మాట్లాడుతూ.. చిన్నా వయసులోనే తాతయ్య మరణించారని దీంతో నానమ్మ నాన్నను చాలా గారాబంగా పెంచిందని తెలియజేస్తోంది. ముఖ్యంగా ఎవరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవారని తెలియజేస్తోంది. సినిమా నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పిన కూడా ఆయన వినిపించుకోలేదు. కేవలం సినిమాల కోసం తనకున్న 400 ఎకరాల భూమిని అమ్మేశారని తెలియజేస్తోంది. దీంతో చాలావరకు నష్టపోయారని అలా నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని చాలాసార్లు తమ కుటుంబంతో చెప్పినట్లుగా తెలియజేస్తోంది సుశీల. ఇక ఆ సమయంలోనే కృష్ణ, విజయనిర్మల గారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఒక వేషం ఇవ్వాలని చెప్పారట.

Krishna and Vijaya Nirmala making a comebackఅలా వారిద్దరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తమ పెళ్లి కోసం కృష్ణ గారు అప్పట్లోనే రూ.10 వేలకు పైగా ఆర్థిక సహాయం చేశారని.. తన తండ్రి కాంతారావుకు మాత్రం సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలియదని చచ్చేదాకా సినిమాలలోనే నటించాలని కోరిక ఆయనలో చాలా పట్టుదలగా ఉండేదని తెలియజేశారు. అయితే ఇండస్ట్రీలో మాత్రం కాంతారావుకు ఆడవాళ్ళ పిచ్చి ఉంది దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారు అనే రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవమని తెలియజేసింది. ప్రస్తుతం సుశీల చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest