“ఏం మాయ చేసావే” సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సమంత ..ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా ..వరుసగా బడా బడా సినిమాల్లో అవకాశాలు అందుకొని బిగ్ స్టార్స్ సరసన క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రతి సినిమాను హిట్ కొట్టుకుంటూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోని.. స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిపోయింది . అంతేనా అంతకన్నా ఎక్కువగా అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో నాగ చైతన్య తో ప్రేమలో పడి ఏకంగా అక్కినేని ఇంటికి కోడలు ట్యాగ్ ని తగిలించుకుంది.
కొన్నాళ్లు బాగానే సాగిన వీళ్ళ కాపురం.. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలు కారణంగా విడాకులు తీసుకుని.. ఎవరి దారి వారిది అన్నట్లు బ్రతికేస్తున్నారు . అయితే సమంత మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్నాను అంటూ కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ క్రమంలోనే సమంత పై ఉన్న నెగెటివిటీ మొత్తం పాజిటివిటీగా టర్న్ అయింది. అంతేకాదు ఆమె త్వరగా ఆరోగ్యవంతంగా పూర్తిగా కోలుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆమెపై పాజిటీవ్ కామెంట్స్ కురిపిస్తున్నారు.
కాగా ఇప్పటివరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన సమంత మయోసైటీస్ వ్యాధిపై ఎలాంటి రిజల్ట్ చూపించకపోయేసరికి ..ఇప్పుడు తన ధ్యాస మొత్తం ఆయుర్వేదం పై మళ్ళించిదట. అందుతున్న సమాచారం ప్రకారం సమంత మయోసైటిస్ వ్యాధికి ఆయుర్వేద మందులను వాడడానికి సిద్ధపడిందట . ఈ క్రమంలోనే ఆయుర్వేదం మెడిసిన్ ని చులకనగా చూసే వాళ్ళకి.. నమ్మని వాళ్ళకి తాను అసలు నిజం ప్రూవ్ చేస్తానని చెప్పుకొస్తుందట. అంతేకాదు “ఆయుర్వేదం పై నాకు నమ్మకం ఉంది ..నా ఆరోగ్యం పూర్తిగా సెట్ అవుతుంది “అంటూ చెప్పుకొస్తుందట. దీంతో సమంత తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా విడాకుల తరువాత నాగ చైతన్య హీరోయిన్ అశోభిత తో ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నాడు. త్వరలోనే వీళ్లు రెండో పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ కూదా వార్తలు వినిపిస్తున్నాయి.