తన రిటైర్మెంట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కమలహాసన్..!!

విశ్వ నటుడు కమలహాసన్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తన సినిమాల గురించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కమలహాసన్ కు ఇది 68వ బర్తడే. ఈ సందర్భంగా ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అభిమానులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కమలహాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పేరు కాస్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. చిన్న వయసులోనే బాల నటుడుగా కమలహాసన్ తన సినీ కెరీర్ ని మొదలుపెట్టారు.

Kamal Haasan is back with latest season of 'Bigg Boss Tamil' - The Hindu  Gallery -1
కమల్ హాసన్ నటించిన చిత్రం కళాతుర్ కన్నమ్మకె బాల నటుడుగా నటించి జాతీయ పురస్కారం అందుకున్నారు. మొదటి చిత్రానికి రూ. 2000 రూపాయలు పారితోషకం కూడా అందుకున్నట్లు తెలుస్తోంది తాజాగా కమలహాసన్ ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని విషయాలను గుర్తుకు చేసుకున్నారు. కమలహాసన్ ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులను మూడుసార్లు దక్కించుకున్నారు. బాలనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ పెద్దయ్యాక నటన వైపు వెళ్ళాలి అనుకోలేదట. కేవలం క్లాసికల్ డాన్స్, సంగీతం నేర్చుకొని ఆ తర్వాత డాన్స్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నారట. అంతేకాకుండా కొరియోగ్రాఫర్ గా రైటర్ గా కొనసాగించాలని అనుకున్నారట కమలహాసన్.

ప్రముఖ డైరెక్టర్ కే బాలచందర్ ఒక సినిమా తీయబోతున్నారని తెలిసి లొకేషన్ కు వెళ్లారట. అలా కమలహాసన్ ని చూసిన బాలచందర్ తనకు అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇవ్వకుండా నటుడుగా అవకాశం ఇచ్చారని అలా వీరిద్దరి కాంబినేషన్లో దాదాపుగా 35 సినిమాలు వచ్చాయట. అందులో మరోచరిత్ర, 16 వయదినిలే వంటి చిత్రాలు కమలహాసన్ కెరీయర్ని మలుపు తిప్పాయి. ఇక అలాగే స్వాతిముత్యం సాగర సంగమం, నాయకుడు ,భారతీయుడు, దశావతారం తదితర చిత్రాలు కూడా కమలహాసన్ కెరియర్ మార్చాయి. తాజాగా రిటైర్మెంట్ పై కమలహాసన్ స్పందిస్తూ తనకు యాక్టింగ్ అంటే ఫ్యాషన్ అని అందుకే ఇందులో కొనసాగుతున్నానని తెలియజేశారు. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇక చాలు అనే ఫీలింగ్ తనకు రాలేదని తెలియజేశారు.