ఏపీలో ఏ మాత్రం అర్ధం కాని రాజకీయాలు చేసేది ఎవరంటే గంటా శ్రీనివాసరావు అని చెప్పొచ్చు..ఆయన చేసే రాజకీయాలు ఎవరికి అర్ధం అవ్వవు..కానీ ఆయనకు మాత్రం బాగా క్లారిటీ ఉంటుంది..ఇప్పటికే పలు పార్టీలు, పలు స్థానాలు మారిన గంటా రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. 2019లో టీడీపీ నుంచి గెలిచిన దగ్గర నుంచి ఆయన టీడీపీలో ఉండటం లేదు. అలా అని వేరే పార్టీలోకి వెళ్ళడం లేదు.
ఇక వేరే పార్టీకి వెళ్తారనుకునే లోపు…టీడీపీలో ఉన్నారనే విధంగా రాజకీయం చేస్తారు. చాలాకాలం నుంచి యాక్టివ్ గా లేని గంటా..ఇటీవల అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ని ఖండించారు. అసలే అయ్యన్న అంటే గంటాకు పడదు..పైగా టీడీపీకి దూరంగా ఉన్నారు..కానీ సడన్‌గా అయ్యన్నకు మద్ధతు పలికారు. దీంతో అంతా షాక్ అయ్యారు. సరే ఇది పక్కన పెడితే..మరొకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా అంటున్నారు.
ఇప్పటికే స్పీకర్‌కు రాజీనామా ఇచ్చారు..ఆ రాజీనామాని ఆమోదించాలని స్పీకర్‌ని కూడా కలిశారు..కానీ రాజీనామా ఆమోదం కాలేదు..అలా అని స్టీల్ ప్లాంట్ కోసం గంటా పోరాడేదేమీ లేదు. తాజాగా మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమం ఉదృతం చేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో గంటా..స్టీల్ ప్లాంట్ కోసం మరోసారి రాజీనామా పత్రం ఇవ్వడానికి రెడీ అంటున్నారు. ఇచ్చిన దాన్నే ఆమోదించుకోవడం లేదు..అటు స్పీకర్ కూడా గంటా రాజీనామాకు ఆమోదముద్ర వేయడం లేదు.
అయితే రాజీనామాకు ఆమోద ముద్ర వేస్తే..విశాఖ నార్త్ స్థానానికి ఉపఎన్నిక వస్తుంది..అప్పుడు గంటా ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారు..అసలు పోటీ చేస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ టీడీపీ-జనసేన కలిస్తే..అప్పుడు బరిలో ఉంటారా? అనేది తెలియదు. మొత్తానికి గంటా రాజకీయమే కన్ఫ్యూజన్ గా ఉంది. మరి ఎన్నికల సమయంలో ఆయన పార్టీ తరుపున ఉంటారో చూడాలి.