కళ్యాణదుర్గం తమ్ముళ్ళు మారేలా లేరుగా..మళ్ళీ డేంజరే?

ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు మారేలా లేరు. ఎప్పటికప్పుడు కుమ్ములాటలతో పార్టీని ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉంచుతున్నారు. మామూలుగా కళ్యాణదుర్గం టి‌డి‌పి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలైంది.. వైసీపీ తరుపున ఉషశ్రీచరణ్ గెలిచారు..ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న సరే అక్కడ అభివృద్ధి తక్కువ..అక్కడ ఆమెకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు.

ఇలాంటి తరుణంలో టి‌డి‌పికి బలపడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ దిశగా టి‌డి‌పి వెళ్ళడం లేదు..ఎప్పటికప్పుడు గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో సీనియర్ నేత హనుమంతరాయ చౌదరీని తప్పించి..ఉమామహేశ్వరనాయుడుకు సీటు ఇచ్చారు. అప్పటినుంచి వారి వర్గాల మధ్య రచ్చ జరుగుతుంది. పార్టీ ఓడిపోయిన సరే..వారి మధ్య గొడవలు ఆగడంలేదు. ప్రస్తుతం ఉమా ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు.

kalyandurg tdp clashes

ఇక ఆయనకు వ్యతిరేకంగా హనుమంతరాయచౌదరీ వర్గం పని చేస్తుంది. ఇరు వర్గాలు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో టి‌డి‌పి క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుంది..ఎటు వైపు వెళ్ళాలి..ఎవరికి సపోర్ట్ చేయాలనేది అర్ధం కాకుండా ఉంది. ఇలా టి‌డి‌పిలో ఉండే వర్గపోరు వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే వైసీపీకి నెగిటివ్ ఉన్నా సరే..టి‌డి‌పిలో ఉండే వర్గ పోరు వల్ల..ఆ పార్టీకి ప్లస్ అయ్యేలా ఉంది. దీని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వైసీకి మంచి అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే పలుమార్లు నాయకులతో మాట్లాడి..కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఇక బాబు దగ్గర ఓకే చెప్పి..నియోజక వర్గానికి వెళ్ళాక రచ్చ లేపుతున్నారు. తాజాగా కూడా పార్టీ సమావేశంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కుర్చీలతో కొట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా సీటు తేల్చేస్తే..క్యాడర్‌కు ఓ క్లారిటీ వస్తుంది. కానీ ఏదేమైనా ..ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించేలా లేరు..దీని వల్ల పార్టీకే నష్టం.