అలా ఎంజాయ్ చేస్తూ ఈఎమ్ఐలు క‌డుతోన్న జాన్వీ… అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చిందిలే…!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన థ్రిల్లర్ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. ఈ సినిమాను మలయాళం లో సూపర్ హిట్ అయిన హెలెన్‌కు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన గ్లామర్ షో తో సోషల్ మీడియాని షేక్‌ చేస్తూ ఉంటుంది.

Janhvi Kapoor looks drop-dead gorgeous in latest PICS | People News | Zee  News

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ పోస్టుల గురించి తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని.. అవి కేవలం నా ఆనందం కోసం మాత్రమేనని కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో నేను పెట్టే గ్లామర్ ఫోటోలు అభిమ‌నుల‌కు దగ్గర అవటానికి మాత్రమే అని.. ఇవి నా ఈఎమ్ఐలు చెల్లించేందుకు సహాయపడతాయని జాన్వి కపూర్ ఎవరు ఊహించని కామెంట్లు చేసింది.

Janhvi Kapoor sizzles in stunning bikinis, check out her vast collection:  PICS | News | Zee News

ఇక సోష‌ల్ మీడియా కామెంట్ల గురించి నేను ఎప్పుడు సీరియస్‌గా తీసుకొను… సోషల్ మీడియా అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నేను చెసే ఫోటో షూట్ లో గ్లామర్ గా క్యూట్‌గా కనిపించడంతో అభిమానులు వాటిని ఇష్టపడతారు. వాటి వల్ల వచ్చే ఆదాయంతో నా ఈఎమ్ఐలు కడుతున్నానని జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇక జాన్వీక‌పూర్ తెలుగులో జూనియ‌ర్ ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే..!

Share post:

Latest