ఈ వ‌ర‌ల్డ్ లో ఆ రెండూ మ‌హాఇష్టం.. ఓపెన్‌గా సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన జాన్వీ!

అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్ మాత్రం పడడం లేదు.

అయితే వెండితెరపై అలరించలేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాకారు కావాల్సినంత ట్రీట్ ఇస్తోంది. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు దుబాయ్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొంది. ఈ ఫంక్షన్ లో జాన్వీ కపూర్ అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ కూడా ఇచ్చింది.

తాజాగా ఈ డాన్స్ పర్ఫామెన్స్ కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న జాన్వీ కపూర్.. ఓ సీక్రెట్ ను కూడా బయట పెట్టింది. `ఈ వరల్డ్ లో నాకు మ‌హాఇష్ట‌మైన ప్ర‌దేశాలు.. కెమెరా ముందు మరియు వేదికపై` అంటూ చెప్పుకొచ్చింది.

కెమెరా ముందు నటించడం, స్టేజ్‌పై ఇలా డాన్సులు చేయడం తనకు ఎంతో ఇష్ట‌మ‌ని జాన్వీ తెలిపింది. ఇక జాన్వి షేర్ చేసిన ఫోటోలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటిలాగే అటు అభిమానులను ఇటు నెటిజ‌న్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

కాగా, సినిమాలు విషయానికి వస్తే ఇటీవల ఈ అమ్మడు `మిలీ` అనే సినిమాతో నార్త్‌ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాల్లో న‌టిస్తోంది.

Share post:

Latest