ఆమె మరణ వార్త విని చనిపోవాలనుకున్న జగపతిబాబు.. ఏమైందంటే..?

టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లలో సౌందర్యకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిల ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమె అందం నటనను బాగా ఇష్టపడుతూ ఉంటారు. సౌందర్య తన సినీ కెరియర్లో 100 కంటే ఎక్కువ సినిమాలలోని నటించింది. అప్పట్లో జగపతిబాబు సౌందర్య కాంబినేషన్లో విడుదలైన ఏ చిత్రమైనా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకునేది. తాజగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు మాట్లాడుతూ జగపతిబాబు అంత పెద్ద స్టార్ అవుతారు అనుకోలేదని తెలియజేశారు.

I Had An Affair With Soundarya'హీరోలుగా ఎవరైనా చేసి..విలన్ గా చేయడం అంటే అంత సులువైన విషయం కాదని ఆయన కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా జగపతిబాబు సినిమా షూటింగ్ కు ఎవరైనా స్నేహితుల వచ్చారంటే తన సొంత డబ్బుతోనే వారికి ఖర్చు చేసే వారిని తెలిపారు. కేవలం ప్రొడ్యూసర్ల పైన భారం పడకుండా ఉండేందుకు జగపతిబాబు అలా ఆలోచించేవారని తెలిపారు. జగపతిబాబు కు మంచి స్నేహితురాలు ఎవరైనా ఉన్నారు అంటే సౌందర్యాన్ని అని తెలియచేశారు రామారావు.

సౌందర్య అకాల మరణం వల్ల తను చనిపోవాలనుకున్నానని జగపతిబాబు ఒకానొక సందర్భంలో చెప్పారని తెలియజేశారు.. సౌందర్య లాంటి స్నేహితులు పోయిన తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉండాలనిపించింది అని రామారావు తెలియజేశారు. అలా జగపతిబాబు ఎక్కువగా ఖర్చు చేసే వారిని దాంతో తన ఇల్లు కూడా అమ్మేశారని తెలియజేశారు. ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా నటిస్తూ బాగానే ఆఫర్లు అందుకున్న తర్వాతే తన స్థిరపడ్డారని తెలియజేశారు ఈ మంది రామారావు. అయితే కేవలం ఇక్కడ ఆయన మంచితనమే తనని కాపాడిందని తెలిపారు.