జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మూడిందా? జైలు శిక్ష తప్పదా?

బాలీవుడ్ సెక్సీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ టైం అస్సలు బాలేదు. గత కొన్నిరోజుల నుండి ఆమెని కేసులు, కోర్టులు అంటూ అంటూ వేధిస్తున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాటియాలా హౌస్ కోర్టుకు హాజరైన విషయం అందరికీ విదితమే. కాగా ఈమె బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. అంతకుముందు ట్రయల్ కోర్టు ఈమెకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. ఇవాల్టితో ఆ గడువు పూర్తి కాగా మరలా ఈరోజు కోర్టుకు హాజరైంది. అయితే కోర్టు ఆమెకి షాక్ ఇచ్చినట్టు భోగట్టా.

ఆమెని ఈ విషయంలో తరచూ ED మరియు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం సహా పలు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని జాక్వెలిన్‌ మాత్రం నాకు ఏ పాపం తెలియదని బుకాయిస్తోంది. మనీ లాండరింగ్ కేసు అంటే మామ్మూలు విషయం కాదు. అందులో జాక్ ఇరుక్కుంది. తాజాగా ఆమె పేరును ఈడీ ఛార్జ్ షీట్‌లో చేర్చింది. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ కూడా తనకు జాక్ తెలుసని చెప్పడంతో ఆమెకి ఈ కేసు మెడకు చుట్టుకుంది. అయితే గతంలో 50 వేల పూచీక‌త్తుపై పాటియాలా కోర్టు జాక్వెలిన్‌కు తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చింది. కాగా ఈ బెయిల్ గడువు నేటితో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో శేఖర్ మాట్లాడుతూ ఆమె నన్ను ప్రేమించడం తప్ప మరేమీ చేయలేదు కాని, డబ్బుకి ఆమెకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం కొసమెరుపు. కాగా ఇది త్వరలో ట్రయల్ కోర్టులో రుజువు అవుతుందని అతని ప్రత్యర్ధులు అంటున్నారు.