మూడేళ్ల తర్వాత ఇండియాకు వ‌చ్చిన ప్రియాంక చోప్రా.. కార‌ణం అదేనా?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చేన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అమెరికా నుంచి ఉన్నట్టుండి ప్రియాంక ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఇండియా వెకేషన్ కి వచ్చిందా? లేదా ఇండియా పై మమకారంతో వచ్చిందా? అంటూ రకరకాల సందేహాలు ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి. అయితే కోవిడ్ రాకముందే ప్రియాంక అమెరికాలో ఉంది అలా రెండేళ్లు గడిచిపోయాయి. సంసార జీవితంలో మునిగిపోయిన ప్రియాంక అప్పటినుంచి మళ్ళీ మధ్యలో ఇండియాకి రాలేదు.

అయితే ఇప్పుడు ప్రియాంక ఇండియాకి తిరిగి రావడం వెనక చాలా కథే ఉందని సమాచారం. అయితే పీసీ కమిట్ అయిన బాలీవుడ్ సినిమాలు మొత్తం కంప్లీట్ చేయాలన్నా నెపంతోనే తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే గతంలోని ప్రియాంక విశాల్ భరద్వాజ్, సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసింది. అలాగే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా అగ్రిమెంట్ చేసినట్లు ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే ప్రఖ్యాత కవి, పాటల రచయిత సాహిర్ లుథ్వానీ జీవితం ఆధారంగా భన్సాలీ ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంది. ఈ సినిమా ఆయన కలల ప్రాజెక్టుగా భావిస్తున్నారట. అయితే ఈ సినిమాలో ప్రియాంక ప్రధాన పాత్రలో కనిపించనున్నదని సమాచారం. అంతేకాకుండా కోవిడ్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన “జీలే జరా“ వచ్చే సంవత్సరం నుండి ప్రారంభం కానున్నది. అంతేకాకుండా ప్రియాంక పలువురు దర్శకులకు కమిట్మెంట్లు ఇచ్చినట్టు కుదిరితే అన్నిటికి ఒకేసారి డేట్లు సర్దుబాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రియాంక వీలైనంత త్వరగా అన్నిటిని పూర్తిచేసుకుని మళ్లీ తిరిగి అమెరికా వెళ్ళిపోయే ఆత్రం తనలో కనిపిస్తుందని బాలీవుడ్ వర్గాల నుండి సమాచారం.

Share post:

Latest