ఏంటి జ‌క్క‌న్న‌.. మ‌హేష్ తో కూడా రెండు పార్టులు ప్లాన్ చేస్తున్నావా?

దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మ‌హేష్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 29వ ప్రాజెక్ట్ ఇది. దీనిపై ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. జక్కన్న స్క్రిప్ట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మ‌రి కొద్ది నెల‌ల్లో ఈ సినిమా పూర్తి కాబోతోంది. ఇక‌ వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో మహేష్-రాజమౌళి సినిమా పట్టాలెక్కే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే `బాహుబ‌లి`ని రెండు భాగాలుగా తీసి అఖండ విజ‌యాన్ని అందుకున్న జక్కన్న మహేష్ తో సినిమాను కూడా రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. కథ డిమాండ్ మేరకే జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. రెండు పార్టులు అంటే దాదాపు ఐదేళ్ల సమయాన్ని రాజమౌళికి కేటాయించాల్సి ఉంటుంది. మరి అంత సమయాన్ని మహేష్ రాజమౌళికి ఇస్తారా..? రెండు పార్టులు చేసేందుకు ఆయ‌న అంగీకరిస్తారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Share post:

Latest