ఇంట్రెస్టింగ్: విజయ నిర్మల తరువాత కృష్ణ మనసు దోచిన ఏకైక హీరోయిన్ ఆమె..!!

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరియర్ లో ఎందరో నటీమణులతో నటించిన, ఆయన సతీమణి అయిన విజయ నాయిక విజయనిర్మలదే పై చేయి. వీరిద్దరూ కలిసి దాదాపు 40 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఈ క్రమంలోని కృష్ణ తన సినీ కెరియర్‌లో ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటించారు. ఈ సినిమాల్లో కృష్ణ సరసన ఎందరో కథానాయకులు మెరిశారు. వారందరిలో ఆయన సతీమణి విజయనిర్మల మొద‌టి స్థానం తర్వాతి స్థానం జయప్రదకే దక్కుతుంది. ఈమె కూడా కృష్ణ సరసన నలభైకు పైగా సినిమాల్లో నటించింది.

Super Star Krishna's Padi Pantalu Will be 40 Years - Social News XYZ

ఇంతకు కృష్ణ సరసన నటించిన తొలి హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్నకు సుకన్య అనే సమాధానమని వస్తుంది. ఆదుర్తి సుబ్బారావు 1965లో తెరకెక్కించిన తేనె మనసులు సినిమాలో వీరిద్దరూ హీరో హీరోయిన్ల గా కలిసి నటించారు. తర్వాత రెండో సినిమాగా వచ్చిన కన్నెమనసులు సినిమాలో సంధ్యారాణితో కృష్ణ జతకట్టాడు. కృష్ణ‌ నటించిన సినిమాల్లో ఎవర్‌ గ్రీన్ సినిమా గూఢచారి 116 ఈ సినిమాలో ఏకంగా ఎవర్ గ్రీన్ గ్లామ‌ర్‌ బ్యూటీ జయలలితతో కలిసి నటించారు. ఆయన ఐదో సినిమాగా వచ్చిన సాక్షి సినిమాలో మొదటి సారిగా విజయనిర్మలతో కలిసి నటించారు. ఆ తర్వాత వాణిశ్రీ,రాజశ్రీ వంటి యంగ్ హీరోయిన్స్ తోను కృష్ణ నటించి అలరించారు. అయ‌న‌ సినీ కెరియర్ లో తనకంటే సీనియర్ అయిన జమునతోనూ కృష్ణ కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కాంచన, శారదా, భారతి వంటి హీరోయిన్స్ తో పాటు నాట్యకారులగా అలరిస్తున్న విజయ లలిత, జ్యోతిలక్ష్మి తోను హీరోగా నటించి ఆకట్టుకున్నారు..

Super Star Krishna: ఆ సినిమా టిక్కెట్ల కోసం 12 కిలోమీటర్ల లైన్ | 12 Kilo Meters Queue Line for Krishna Simhasanam Movie Tickets

ఇంతమంది స్టార్ హీరోయిన్స్ తో నటించిన, కృష్ణ హిట్ పెయిర్ గా విజయనిర్మలనే నిలిచారు. కృష్ణ కెరియర్ను మలుపు తిప్పిన సినిమా మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు సినిమాలో విజయనిర్మల హీరోయిన్గా నటించడం విశేషం. విజయనిర్మల తర్వాత కృష్ణతో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ జయప్రద ఆయనతో ఈమె తొలిసారిగా శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ ఈనాటి బంధం ఏనాటిదో, దొంగలకు దొంగ, దొంగల వేట, అల్లరి బుల్లోడు, కుమార్ రాజా, అతనికంటే ఘనుడు, కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ, శంకు తీర్థం, బలే కృష్ణుడు, ఊరికి మొనగాడు, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో వీళ్ళందరూ కలిసి నటించారు.. వీరిద్దరూ కలిసి ఒకేసారి లోక్ సభకు ఎంపీలుగా ఎన్నిక కావడం విశేషం.

Will Mahesh Babu With Janhvi Kapoor Recreate Krishna-Sridevi Chemistry ?

కృష్ణకు జోడిగా జయచిత్ర, జయసుధ వంటి వారితో పాటు శ్రీదేవి రాధ వంటి ఎవర్ గ్రీన్ స్టార్లు కూడా నటించి మురిపించారు. ఎందరో హీరోయిన్లు ఆ రోజుల్లో కృష్ణతో నటిస్తే చాలు మంచి పేరు వస్తుందని భావించేవారు. లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే విజయశాంతి కూడా తొలిసారి కృష్ణ సరస నే ‘కిలాడీ కృష్ణుడు’లో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత అంబికా, భానుప్రియ, రంభ, రోజా, సౌందర్య, రమ్యకృష్ణ వంటి వారు కూడా కృష్ణ సినిమాల్లో హీరోయిన్లుగా నటించి ఆకట్టుకున్నారు. ఆయన చివరగా హీరోగా కనిపించిన సినిమా శ్రీ శ్రీ అందులోనూ ఆయనకి జంటగా విజయనిర్మలనే నటించడం విశేషం!! కృష్ణ దాదాపు నాలుగు తరాల తారలతో జతకట్టి అలరించారు. ఇక కృష్ణ తనా సినిమాల్లో హీరోయిన్లతో కలిసివే డ్యాన్సులు కూడా గమ్మత్తులు అవి ఇప్పటికీ కూడా బుల్లితెరపై అడపాదడప ప్రాసారమై అభిమానులకు ఆనందం పంచుతూనే ఉన్నాయి.

Share post:

Latest