ఇప్పటికిప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే.. ఎవరిది పై చేయంటే..?

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉత్కంఠ భరితంగా మారనున్నాయి. ముఖ్యంగా దేశంలోనే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకె అనుకూలంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇక తెలంగాణలో జరిగిన మన గోడు నియోజకవర్గం తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో 6 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసింది. అలా జరిగిన వాటిలో ఐదు స్థానాలలో ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలే గెలుచుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న పార్టీలవైపే ప్రజలు ఎక్కువగా మగ్గుచూపుతుండడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విషయంలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.

Barring Tirupati, JSP's impact negligible over TDP's loss in Chittoor district
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలలో అధికార పార్టీల హవా బాగా కొనసాగుతోంది. దీంతో ఏపీలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే విషయంపై ఉప ఎన్నికల ఆధారంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఏ ఉప ఎన్నిక జరిగిన కూడా వైసీపీనే విజయపతాకాన్ని ఎగురవేస్తుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరొక ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. మరొకవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన జనసేన, తెలుగుదేశం నాయకులు తాము బలోపేతమయ్యామని వచ్చే ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తామని చెబుతూ ఉన్నారు.

ఏపీలో ప్రజలు వైసీపీకి ఎక్కువ మొగ్గు చూపుతారా లేదా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కొన్నాళ్లపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ రాబోయే వేసవిలో లేదంటే డిసెంబర్ నెలలోనే ఎన్నికలు రావచ్చు అని తెలియజేశారు. ఇక ఉప ఎన్నికల ఫలితంతో దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలను గమనిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం అధికార పార్టీకి మేలు జరుగుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాల వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తూ ఉన్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఈ విషయం హీట్ టాపిక్ గా మారుతుంది రాజకీయాలలో.

Share post:

Latest