ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే చెర్రీ ఎస్‌… ఇంత పెద్ద షాకిస్తాడ‌నుకోలేదే…!

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడుగా మెగా ఫోన్ పట్టిన దర్శకుడు బుచ్చిబాబు. తన మొదటి సినిమా ఉప్పెనతో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్‌తో దర్శకుడుగా తన కెరియర్ మొదలు పెట్టిన ఈ దర్శకుడు. ఆ సూపర్ హిట్ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ రెండేళ్ల నిరీక్షణకు తగ్గ ఫలితమే వచ్చేలా ఉంది.

No Tension about Uppena Climax

బుచ్చిబాబు తన తర్వాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడని సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు కానీ ప్రాథమిక అంగీకారం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను సతీష్ కిలారు అనే కొత్త ప్రొడ్యూసర్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇతను మైత్రి మూవీస్ కి సన్నిహితుడు కాపటం వల్లే సాధ్యమైందని అంటున్నారు.

Jr NTR To Collaborate With Director Buchi Babu Sana In A Film Titled, Pedhi

ఇదంతా పక్కన పెడితే బుచ్చిబాబు చెప్పిన కథ గతంలో తారక్ కు చెప్పిన పెద్ది ( ప్రచారంలో తిరిగిన టైటిల్) అదే కథ అన్న ప్రశ్న మాత్రం సస్పెన్స్ గా ఉండిపోయింది. ఇక ఆ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో హీరో డ్యూయల్ రోల్ కనిపించేలా బుచ్చిబాబు ఎంతో కొత్తగా ఈ కథను రాసుకున్నాడని అప్పట్లో ఓ టాక్ కూడా నడిచింది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబోలో చేస్తున్న సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ డ్యూయల్ రోల్ సినిమాలు ఒప్పుకోక పోవచ్చు కాబట్టి… బుచ్చిబాబు కొత్తగా వేరే కథను రెడీ చేసి ఉంటాడట‌. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న రామ్ చరణ్ అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక శంకర్ తో తిరిగి రానున్నాడు. బుచ్చిబాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాక తేలుతుంది. ఏదేమైనా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన డైరెక్ట‌ర్‌కు చెర్రీ ఎస్ చెప్ప‌డం కాస్త షాకింగే..!

Share post:

Latest