కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో ఈజీగా హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఇక మరికొన్ని సినిమాలో టాక్ ఎలా ఉన్నా కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజా సినిమా యశోద. ఈ చిత్రంలో సమంత పాన్ ఇండియా హిట్ కొట్టేద్దాం అనుకుంది.. కానీ తన కల నెరవేరలేదు. ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు అన్ని భాషలలో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్ల గ్రాస్ కలెక్షలను రాబట్టుకుంది.
ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు దాదాపు రూ.18 కోట్ల షేర్ వచ్చినట్టు. ఈ పాన్ ఇండియా హిట్ తో సమంత తన స్టార్ డంను మరో రేంజ్ కు తీసుకువెళ్లింది. నిజంగా చెప్పాలంటే ఎవరు ఎంచుకొని సరోగసి లేడీ ఓరియంటెడ్ కథ ఎంచుకోవడం గ్రేట్. ఈ సినిమాలో ఏమాత్రం గ్లామర్ టచ్ కానీ, అడల్ట్ కామెడీ లేకపోయినా సమంత సింగిల్ హ్యాండ్ తో ఈ సినిమాతో రూ.33 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టేలా చేసింది.
సినిమాకు సమంత ఏం మాత్రం ప్రమోషన్లో పాల్గొనకపోయినా.. కేవలం ఒక ఇంటర్వ్యూ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌తో సినిమాను ఈ స్థాయికి తీసుకువెళ్లిందంటే గొప్ప విషయమే. ఒకవేళ ఇదే యశోద సినిమాను సమంత బాగా తిరిగి ప్రమోషన్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేదే. ఏదేమైనా అక్కినేని హీరోల సినిమాలు ఫట్ మంటుంటే సమంత సింగిల్ హ్యాండ్‌తో ఇంత పెద్ద హిట్ కొట్టి తన పైచేయి చాటుకుంది.