పెళ్ళి అంటూ చేసుకుంటే ప్రభాస్ తోనే..ఎట్టకేలకు ఓపెన్ అయిన కృతి..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాలలో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నా ‘ఆది పురుష్’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ముందుగా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకు రావాలనుకున్నారు. కాని ఈ సినిమా టీజర్ విడుదల అయ్యాక‌ టీజర్ కి భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీజర్ పై నెగటివ్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి.

Adipurush: Prabhas, Kriti Sanon & Others Face Legal Notice For Allegedly  Insulting Hindu Religion - Deets Inside

 

సినిమాలో కొంత భాగం షూటింగ్ రీ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అందుకే ఈ సినిమాను 2023 జూన్ నెలకు వాయిదా వేశారు. ఈ సినిమాల విషయం ఎలా ఉన్నా టాలీవుడ్ మొత్తంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ముందుగా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. ప్రభాస్ పెళ్లిపై కూడా ఎప్పటినుంచో ఎన్నో రూమర్లు కూడా వస్తున్నాయి. అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తల్నివారు ఖండిస్తూ మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. అనుష్క ప్రభాస్ విషయం పక్కనబెడితే.. ఇప్పుడు గత కొంతకాలంగా ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు ఆది పురుష్‌ సినిమాలో కలిసి జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమ లాగా మారిందని ఓ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ప్రభాస్, కృతి ఎవరు స్పందించలేదు.

Amidst link-up rumours, Prabhas and Kriti Sanon's crackling chemistry at  'Adipurush' teaser launch has fans declaring 'They look good together' |  Hindi Movie News - Times of India

ఇప్పుడు కృతి- ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని ఓ బాంబ్‌ పేల్చింది. కృతిస‌నన్ బాలీవుడ్ లో వరుణ్ ధావన్ కు జంటగా తోడేలు అనే సినిమాలో నటించింది. ఆ సినిమా నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కృతిని ప్రభాస్ గురించి అడగగా అప్పుడు ‘కృతి ఒకవేళ ఛాన్స్ దొరికితే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది’. ప్రస్తుతం ఈ బాలీవుడ్ భామ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కృష్ణంరాజు మరణించినప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి వార్తలే వచ్చాయి. ఈ వార్తలు నిజం అనుకునేలా ఆదిపురుష్ టీజర్ ఈవెంట్లో వీరిద్దరూ కొంత దగ్గరగా ఉండటం మరిన్ని అనుమానాలు పెంచేసింది. ఇప్పుడు కృతి, ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest