తన ప్రేయసి విషయంలో క్లారిటీ ఇచ్చిన హృతిక్ రోషన్.. అంత మాట అన్నాడా..!!

గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- సింగర్ సబా ఆజాత్ పై రకరకాల వార్తల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. కలిసి తిరుగుతున్నారని.. వాళ్ళిద్దరూ డేటింగ్ లో అన్ని పనులు కాని చేశారని..హృతిక్‌ రోషన్‌ తన ప్రియురాలి కోసం ఏకంగా వందకోట్లతో ముంబైలో లగ్జరీ ప్లాట్ కూడా కొన్నాడంటూ .. ఇలా ఎనో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ వార్తలు నిజం అనుకొనేలా వీరిద్దరూ కూడా చాలా క్లోజ్ గా ఉంటూ మీడియాకు దొరుకుతూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంపై హృతిక్ రోషన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

Hrithik Roshan, Saba Azad To Reportedly Move Into Plush Rs 100 Crore Sea-Facing Mumbai Home

హృతిక్ రోషన్ ఈ వార్తలపై మాట్లాడుతూ.. ”అలాంటిదేమి లేదంటూ.. జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై అతను కొంత అసహనానికి గురయ్యాడు.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు”. ”ఓ సెలబ్రిటీగా నాకు సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి ఉండటం కామన్”.. ”ఈ విషయాన్ని నేను అర్థం చేసుకుంటా.. కానీ అవి ఆరోగ్యకరంగా ఉండాలి ఇలా.. ఏది పడితే అది తప్పుడు సమాచారాన్ని రాయకూడదు”.. అందుకే ఇలాంటి న్యూస్ కు నేను దూరంగా ఉండటం ఉత్తమం.. నేను ప్రత్యేకించి చెప్పేది బాధ్యత గల మీడియా రిపోర్టర్లకు విజ్ఞప్తి చేస్తున్న… అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Bollywood Top Stories: Hrithik Roshan celebrates Diwali with Saba Azad, Have you heard? Prepping again

హృతిక్ రోషన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను 2024లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Share post:

Latest