సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమె.. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి ఎన్నో కొత్తదనాలను పరిచయం చేశారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం కృష్ణ మరణించడం జరిగింది. దీంతో కృష్ణ మరణించిన వారం రోజులైనా కూడా అభిమానులు కృష్ణ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతోమంది సీనియర్ హీరోలు ఎక్కువ సంఖ్యలో సినిమాలు నటించిన హీరోగా కృష్ణ పేరు సంపాదించారు. కృష్ణ మరణాన్ని ఆయన అభిమానులు, సిని ప్రముఖులు, కుటుంబం సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక త్వరలోనే మహేష్ బాబు కూడా రెగ్యులర్ షూటింగ్లో బిజీ కాబోతున్నారు.అయితే కృష్ణ గుండెపోటు వచ్చిన రోజు ఏం జరిగిందని విషయాలను తన సోదరుడు ఆదిశేషగిరిరావు తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రాత్రి 12:30 గంటలకు సమయంలో కృష్ణ గారికి గుండెపోటు రావడం జరిగిందని అన్నయ్య రూమ్ బయట ఉన్న కుర్రాడు అన్నయ్య పల్స్ ఎర్రర్ చూపించడంతో నాకు ఫోన్ చేశారని తెలిపారు ఆది శేషగిరిరావు. ఇక తన అన్నయ్య ప్రతిరోజు కూడా గురకపెట్టే అలవాటు ఉందని అయితే ఆరోజు గురక పెట్టకపోవడంతో కుర్రాడు చాలా భయపడ్డాడు అని ఆ తర్వాత వెంటనే కృష్ణ గారిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నేను సూచన ఇచ్చానని తెలిపారు ఆదిశేషం గిరి రావు.
హార్ట్ ఎటాక్ వచ్చిన 20 నిమిషాలలో అన్నయ్యని ఆసుపత్రిలో చేర్పించి ఉంటే ఆయన బ్రతికి ఉండేవారని ఆదిశేషగిరిరావు తెలియజేశారు. ఆలస్యం కావడం వల్ల రక్తప్రసరణ ఆగిపోయిందని తెలిపారు. దాదాపుగా 30 గంటలపాటు వైద్యులు కష్టపడిన ఫలితం లేకుండా పోయిందని తెలియజేశారు. ఆదిశేష రావు వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.