ఫ్యాన్స్ కి హీరో అజిత్ స్వీట్ వార్నింగ్… ‘ఉన్నతంగా బతుకుదాం’ అంటూనే క్లాస్ పీకాడు!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలుగులో మాస్ హీరో అభిమానులు ఏ విధంగా అయితే కొట్టుకు చస్తారో, అక్కడ కూడా ఫ్యాన్ వార్స్ చాలా కామన్. అయితే ఒక్కోసారి ఈ అభిమానం అతిగా మారుతుంది. ఒకప్పడు ఫ్లెక్సీలతో తమ అభిమానం చాటుకున్న అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వీరు వేరొక హీరో అభిమానులకు కోపం తెప్పించే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమనే చెప్పుకోవాలి.

అయితే ఈ విషయంలో తెలుగు హీరోల అభిమానులు కొంచెం బెటర్. తమిళ స్టార్ హీరోల అభిమానుల యొక్క అరాచకాలు మరీ దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానులు వర్సెస్ అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా రచ్చ రచ్చ చేస్తుంటారు. విషయం ఏమంటే వచ్చే ఏడాది పొంగల్ కి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాతో పాటు అజిత్ నటిస్తున్న సినిమా కూడా విడుదల కాబోతుంది. కాగా ఈ 2 సినిమాల విడుదల హడావుడి మొదలు కాకుండానే అభిమానుల యొక్క సోషల్ మీడియా హడావుడి దాదాపు మొదలు అయిపోయింది.

మా హీరో సంక్రాతి విజేత అంటే మా హీరో విజేత అంటూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో సినిమాలకు జరగబోతున్న డ్యామేజీని తల్చుకుని ఆయా సినిమాల యొక్క నిర్మాతలు మరియు దర్శకులు ఒకింత ఆందోళనకు గురి అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో హీరో అజిత్ రంగ ప్రవేశం చేసాడు. ఈ నేపథ్యంలో హీరో అజిత్ అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. “మనం బతకడంతో పాటు అవతలి వారిని కూడా బతకనిద్దాం. దయచేసి నెగెటివిటీ వద్దు.. సోషల్ మీడియాలో అనవసర డ్రామాలు వద్దు. మీ చుట్టు కూడా మిమ్ములను ప్రోత్సహించే వారిని పెట్టుకొని ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించండి” అంటూ అజిత్ ఫ్యాన్స్ కు హిత భోద చేసాడు.

Share post:

Latest