రష్మిక నోటి దురుసు.. `పుష్ప 2 `కు భారీ నష్టలు త‌ప్ప‌వా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నోటి దురుసు కారణంగా `పుష్ప 2` చిత్రానికి భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ కన్నడ సోయగం గత కొద్దిరోజుల నుంచి తన మాటలతో కన్నడిగులకు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో పుట్టి కనడాలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తనకు కన్నడ మాట్లాడటం స‌రిగ్గా రాదంటూ ఇటీవల పేర్కొంది. అలాగే కన్నడలో సంచల‌న‌ విషయాన్ని నమోదు చేసిన కాంతార‌ సినిమాపై సౌత్‌, నార్త్‌ సినీ ప్రముఖుల సైతం ప్రశంసలు కురిపించారు.

రీసెంట్గా ముంబైలో ఓ రిపోర్టర్ రష్మికను సైతం `కాంతార` గురించి ప్రశ్నించగా.. అసలు ఆ సినిమా చూడలేదని, చూసేంత టైం కూడా లేదని చెప్పి కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసింది. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మీకు మొదటి ఛాన్స్ ఎలా వచ్చింది అని ప్ర‌శ్నిస్తే.. రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా తన ఫోటో చూసి ఓ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పిలిచారు అంటూ పేర్కొంది. దీంతో వివాదం మరింత ముదిరింది. కన్న‌డ హీరోయిన్ అయినా సరే కన్నడలో రష్మిక సినిమాలు చేయడం లేదని, పైగా సొంత ఇండస్ట్రీని అవమానించే విధంగా మాట్లాడుతుందంటూ కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియా వేధిక పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే కన్నడ పరిశ్రమ ఆమెను బ్యాన్ చేయబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్త‌లే నిజమైతే రష్మిక అప్ కమింగ్ చిత్రాలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఈమె చేస్తున్న పుష్ప 2 చిత్రం కోట్ల రూపాయల వ‌సూళ్ల‌ను కోల్పోవాల్సి వస్తుంది. సౌత్లో తెలుగు చిత్రాలకు కర్ణాటక అతిపెద్ద మార్కెట్ గా ఉంది. తమిళనాడు కేరళతో పోలిస్తే అక్కడ తెలుగు చిత్రాలకు ఆదరణ ఎక్కువ. ఇప్పుడు కన్నడలో రష్మికను బ్యాన్ చేస్తే పుష్ప 2 చిత్రానికి భారీ నష్టాలు వాటిల్లే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే విజయ్ తో ర‌ష్మిక చేస్తున్న `వారసుడు` సినిమాకు సైతం దెబ్బ పడటం ఖాయం అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest