చీర‌లో చిత్ర‌వ‌ధ చేస్తున్న `హ‌నుమాన్‌` బ్యూటీ.. ఏముంది రా బాబు..!

అమృత అయ్య‌ర్‌.. `పద్మవ్యూహం` అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన ఈ భామ `పదైవీరన్` అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది.

రామ్ హీరోగా వచ్చిన `రెడ్` సినిమాతో అమృత అయ్యర్‌ తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో ప్రేక్షకులకు దగ్గర అయింది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు యంగ్ హీరో తేజ సజ్జా కు జోడిగా `హనుమాన్` సినిమాలో నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. రీసెంట్గా ఈ మూవీ టీజర్ లాంచ్ చేయ‌గా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇది ఎలా ఉంటే అమృత అయ్యర్ తాజా ఫోటోషూట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది మారింది. ఎల్లో కలర్ ప్లెయిన్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించిన అమృత అయ్యర్‌.. అందంగా ముస్తాబై దర్శనమిచ్చింది.

చీర‌లో అమృత చిత్ర‌వ‌ధ చేసేంద‌నే చెప్పాలి. ఈమె తాజా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమృతను చూసిన కుర్ర‌కారు ఏముంది రా బాబు అంటూ పిచ్చెక్కిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అమృత తాజా పిక్స్ మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Latest