ప్రస్తుతం ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో హీరోయిన్స్ కూడా సినిమా అవకాశాలు తగ్గాయని తెలిసిన వెంటనే పెళ్లికి సిద్ధమవుతున్నారు. తర్వాత ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదులుకొని మరి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు దేశముదురు భామ హన్సిక కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. టాలీవుడ్‌కు దేశముదురు సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ తర్వాత టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది.
టాలీవుడ్లో సూపర్ క్రేజ్ వచ్చాక కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉండడంతో తమిళ్ హీరోలకి హన్సిక బాగా కలిసి వచ్చింది. అక్కడ ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఈ క్రమంలోనే అక్కడ తన సినిమాలతో పాటు ఎఫైర్లు కూడా బానే నడిపింది హన్సిక.. శింబు, సిద్ధార్థ వంటి హీరోలతో హన్సిక రిలేషన్షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోగలిగారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అంటే ఆమె అభిమానులు.. హీరోలు ఏమైపోతారని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంటే ఆమెను మునుపటిలా చూడలేమని ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు.
పెళ్లి చేసుకుని సినిమాలుకు దూరమైతే భరించడం కష్టమే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే హన్సిక తన చిన్ననాటి స్నేహితుడైన సోహెల్ తో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇక దీంతో అభిమానులు తమకు ఇష్టమైన హీరోయిన్ సినిమాలకు దూరం అవుతుందని బాధపడుతున్నారు.