రామ్ చరణ్ తర్వాత సినిమా.. ఆ క్రేజీ డైరెక్టర్ తో నేనా..!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 15వ సినిమా అని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. మరి కొన్ని కీలకపాత్రలో అంజలి, శ్రీహకాంత్, సునీల్ వంటి అగ్ర నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ భారీ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది.

అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాల గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ముందుగా రామ్ చరణ్ తన 15వ సినిమా తర్వాత జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల ఇద్దరి కాంబో మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే అంశంపై అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ పాన్ ఇండియా హీరోతో సినిమా చేయడానికి పలువురు యువ దర్శకులు లైన్లో ఉన్నారు. రామ్ చరణ్ ఇప్పుడు ఏ క్రేజీ యువ దర్శకుడు తో సినిమా చేస్తారన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

Share post:

Latest