Exclusive: సినీ ఇండస్ట్రీ చేసుకున్న పాపం..మొదటి తరం నటులకు ఇక సెలవు..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు అందరూ కళామతల్లి బిడ్డలే. అయితే కళామ తల్లి తొలి బిడ్డలంటే మొదటి తరం స్టార్ హీరోలని చెప్పవచ్చు. అలాంటి మొదటి త‌రం స్టార్ హీరోలు ఇప్పుడు పూర్తిగా కళామతల్లిని విడిచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం మరణించడంతో తొలి తరం స్టార్ హీరోలు సినిమాపరిశ్రమను, వారి అభిమానులను శోక‌ సంద్రంలో విడిచి వెళ్లిపోయారు. మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ… ఇలా ఐదుగురు అగ్ర హీరోలు మనకి ఇక లేరు.

ఎన్టీఆర్‌తో ఏఎన్నార్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ, జమునల విభేదాలు.. కారణాలివే? |  big clashes between ntr anr krishna and jamuna arj

ఏ ఇంటికైనా నాలుగు మూల స్తంభాలు ఉంటాయి అంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి రావటానికి ఒకానొక సమయంలో ఈ ఐదుగురు మూల స్తంభాలుగా ఉన్నారు.. తెలుగు చిత్ర పరిశ్రమను అగ్రస్థాయికి తీసుకువెళ్లడంలో ఐదుగురు స్టార్ హీరోలు తమ శక్తికి మించిన కృషి చేశారు. అలాంటి ఆ స్టార్ హీరోలు ఇప్పటికి మాకు ఆదర్శం అంటూ నేటి తరం న‌టులు చెబుతున్నారు.. అంటే వీళ్ళు ఎంతలా చిత్ర పరిశ్రమ మీద వాళ్ళ ముద్ర వేశారో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ ఐదుగురు దిగ్గజ నటుల్లో ముందుగా దివికేగింది నందమూరి తారక రామారావు.. ఈయన జనవరి 18 1996 ను మరణించారు. ఈయన తర్వాత శోభన్ బాబు మార్చ్ 22, 2008 లో ఈయన స్వర్గస్తులయ్యారు. ఈ ఇద్దరి అగ్ర హీరోలు తర్వాత కళామత‌ల్లిని ఒంటారి చేసి వెళ్లిపోయింది అక్కినేని నాగేశ్వరరావు ..ఈ అగ్రా నటుడు జనవరి 22, 2014లో కన్నుమూశారు. ఇక కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు మనందరిని విడిచి వెళ్లిపోయారు.. ఈయన సెప్టెంబర్ 11, 2022న మరణించారు. ఇక ఇప్పుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ కళామతల్లిని ఒంటరి చేసి సినిమా పరిశ్రమను శోకసంద్రంలో విడిచి ఈరోజు ఉదయం మరణించారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోలుగా వెలిగిన మొదటి శకం స్టార్ హీరోల శకం ముగిసింది. చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన అగ్ర నటులు ఎప్పటికీ చిరస్మరణీయులే.