ఇంతటి బాధలో కూడా మహేష్.. మరొకరికి ప్రాణం పోశాడు..!!

రీసెంట్గా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఎంతటి తీవ్ర విషాదం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ లోనే శిఖరం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు దీనితో మహేష్ ఇంట మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఇంతటి తీవ్ర విషాదంలో కూడా మహేష్ బాబు అందించే సేవ మాత్రం ఆగలేదు ఇలాంటి తీవ్ర విషాదంలో కూడా ఆయన చేస్తున్నసేవ చూస్తుంటే ఆయనలో ఉన్నతమైన లక్ష్యాలని చూపిస్తుంది.

Mahesh Babu says its a classic and movie of decade

మహేష్ బాబు తన కూతురు సితార జన్మించినప్పటి నుంచి తన పేరుతో స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు ఇంట్లో ఇంతటి తీవ్ర విషాదం నెలకొన్నప్పుడు కూడా మోక్షిత్ సాయి అనే చిన్నారికి తన ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేయించి అతనికి ఊపిరి పోస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ వార్త బయటకు రావడంతో మహేష్ అభిమానులు మరియు నెటీజన్స్ మహేష్ ఎంతో గొప్ప వ్యక్తిని అంటూ అంత బాధలో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా ఉన్నతమైన మనసు చాటుకున్నాడని కామెంట్ లో పెడుతూ మహేష్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Share post:

Latest