సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తెలుసా.. తెలిస్తే షాక్ అయిపోతారు..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖరంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ మొన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కృష్ణ తన సినీ జీవితంలో ఇప్పటివరకు 340కు పైగా సినిమాలలో నటించారు. అయ‌న‌ హీరోగా సినిమాలు తీస్తున్న సమయంలో ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతను పోటీపడి వచ్చేవారు అంటే అతిశయోక్తి కాదు. ఆయనతో సినిమా తీసిన‌ ఏ నిర్మాత అయిన నష్టపోతే ఆయన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Super Star Krishna Highest Remuneration: కృష్ణ తన సినీ కెరీర్ లో తీసుకున్న  హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

ఆయన కెరియర్ ను 2000 రూపాయల పారితోషికంతో మొదలుపెట్టి హైయెస్ట్ రెమ్యూనిరేషన్ గా కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు అంటే నమ్మశక్యం కాదు. హీరో రెమ్యూనిరేషన్ తగ్గించుకోవటం ద్వారా నిర్మాతలపై భారం తగ్గుతుందని కృష్ణ నమ్మేవారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆయన సినిమాలలో సూపర్ స్టార్ గా మారాక ఆయనపై అభిమానంతో నిర్మాతలు చాలామంది అరకోటి నుంచి కోటి దాకా రెమ్యునరేషన్ ఇచ్చిన ఆయన తీసుకోకుండా ఆయనకి కావాల్సిన రిమ్యునుకేషన్ మాత్రమే తీసుకునేవాడు. ఆయన తన సీని కెరియర్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ గా తీసుకున్నది 25 లక్షల రూపాయలు మాత్రమే అని నటి కుమార్ అన్నారు.

Super Star Krishna Highest Remuneration: కృష్ణ తన సినీ కెరీర్ లో తీసుకున్న  హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

90వ దశకం నుంచి 2000 దశకం మధ్యలో కృష్ణా సూపర్ స్టార్ గా కొనసాగాడు. ఆ టైంలో ఆయన ఏ సినిమా తీసిన సూపర్ హిట్ సినిమాగా నిలిచేంది. ఆ సమయంలో ఆయన తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమేనని నట్టి కుమార్ చెప్పుకొచ్చాడు. కృష్ణ ఆయన భార్య విజయనిర్మల వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని.. విజయనిర్మల మరణం అనంతరం ఆయన ఒంటరి అయ్యారని ఇక దీనితోపాటు ఆయన కొడుకు రమేష్ బాబు మరణం ఆయనను మరింత బాధపెట్టిందని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. ఇక ఆయన భార్య‌ విజయనిర్మల ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించకుండా ఉంటే కృష్ణ మరికొన్ని సంవత్సరాలు పాటు మన మధ్య ఉండే వారిని ఆయన వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరియర్ లో ఎన్నో ప్రయోగాత్మమైన సినిమాలలో చేశారని ఆయన రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయని నట్టి కుమార్ చెప్పుకొచ్చాడు.