వామ్మో..యశోద కోసం సమంత అన్ని కోట్లు చార్జ్ చేసిందా..? ఫస్ట్ టైం హైయెస్ట్ రికార్డ్..!!

ప్రజెంట్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. దానికి మెయిన్ రీజన్ ..”యశోద” సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన కోలీవుడ్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద . ఎటువంటి హీరో లేకుండా సింగిల్ హ్యాండ్ తో లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ కి జనాలు ఫిదా అయిపోయారు.

జనరల్ గా ఇలాంటి యాక్షన్ సీన్స్, స్టంట్స్ పేరున్న పెద్ద బడా హీరోలే చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత ఇలాంటి యాక్షన్ సీన్స్ లో నటించి డేఅర్ చేసిందని చెప్పాలి . అంతేకాదు యాక్షన్ సీన్స్ లో నటించడమే కాకుండా ఆ యాక్షన్ సీన్స్ తో మెప్పించడం మరో సంచలనం అంటున్నారు సినీ విశ్లేషకులు . మరీ ముఖ్యంగా సరోగసి ప్రాసెస్ థీమ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత అమాయకపు యువతిగా, అలాగే ఫైర్ బ్రాండ్ పోలీస్ ఆఫీసర్గా రెండు వేరియేషన్స్ లోనూ జనాలను మెప్పించింది .

అంతేకాదు సమాజంలో జరుగుతున్న ప్రస్తుత అంశాలను క్లియర్ గా చూపించింది. కాగా మనకు తెలిసిందే ఈ సినిమా సగం షూటింగ్ టైంలోనే సమంత విడాకులు తీసుకుంది . అంతేకాదు తన డిప్రెషన్ వల్ల మేకర్స్ లాస్ కాకూడదని విడాకులు ప్రకటించిన రెండు వారాలకే యశోద సినిమా సెట్స్ లో అడుగుపెట్టి..డేర్ గల అమ్మాయిగా మార్కులు కొట్టేసింది. కాగా మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకున్న యశోద సినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా సమంత గ్రాఫ్ ను పైపైకి పెంచుకుంటూ పోతుంది. అంతేకాదు ఈ సినిమా కోసం సమంత కూడా ఫస్ట్ టైం కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా ఆరు కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు సమంత తన కెరీర్లు హైయెస్ట్ పారితోషకం తీసుకున్న సినిమా పుష్ప ..అది కూడా ఐటెం సాంగ్ కోసమట. కాగా యశోద సినిమా కోసం తన బౌండరీస్ క్రాస్ చేస్తూ 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి నెక్స్ట్ సినిమాకి సమంత ఏ రేంజ్ లో పుచ్చుకుంటుందో..?

Share post:

Latest