టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ హైట్.. ఆ వెయిట్,, ఆ అందం,, ఆ కలర్ ..పర్ఫెక్ట్ హీరోయిన్ ఫిగర్ అని చెప్పాలి. అంతేకాదు తనపై ఎలాంటి కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసిన సరే టంగ్ స్లిప్ అవ్వకుండా బ్రెయిన్ తో ఆన్సర్ ఇచ్చే మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అంటూ జనాలు చెప్పుకొస్తారు . ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన.. ఈ రాశి ఖన్నా.. నేడు 32వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది .
ఎస్ నేడు రాశీ ఖన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రాశి కన్నాకు హ్యాపీ బర్త డే అంటూ విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాశిఖన్నా గో గ్రీన్ సేవ్ ఎర్త్ అనే నినాదాన్ని పాటించింది . తన పుట్టినరోజు సందర్భంగా చెట్లను నాటుతూ ఫోటోకి ఫోజులిచ్చింది . ప్రస్తుతం ఆ ఫోటో లు సోషల్ మీడియాలో ట్రెండిగా మారాయి . కాగా ఇదే క్రమంలో రాశీ ఖన్నాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది .
12 స్టాండెడ్ లో టాపర్ గా నిలిచింది. అప్పటి నుంచే అడ్వర్టైజ్ మెంట్ ఇండస్ట్రీలో రాణించాలని బాగా ప్రయత్నించింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ కు కాపీ రైటర్ గా పనిచేసింది. అయితే ఈ క్రమంలోనే ముంబైకి చేరిన రాశి ఖన్నా హీరోయిన్ అవ్వడానికి చాలా విధాలుగా ట్రై చేసిందని.. అప్పుడు ఒకే రూమ్లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ వాణీ కపూర్- రాశిఖన్నా ఉన్నారని..ఇద్దరు కూడా హీరోయిన్గా అవ్వడానికి సతవిధాల ప్రయత్నించారని ..
రూమ్ లోనే ప్రాక్టీస్ చేశారని ..వాణి కపూర్ కి రాశీ ఖన్నా.. రాశి ఖన్నాకి -వాణికపూర్ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకున్నారని తెలుస్తుంది. ఒక్కే ఏడాదిలో 2013లో ఇద్దరు హీరోయిన్లుగా అవకాశం అందుకొని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడిస్తున్నారు . 32 ఏళ్ళు వచ్చేసినా ఈ బ్యూటీ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.