ధమాకా: లిరికల్ వీడియోతో అదరగొడుతున్న రవితేజ.. సక్సెస్ పక్కా..!

డైరెక్టర్ నత్తిన త్రినాధరావు డైరెక్షన్లో హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీలా నటిస్తూ ఉన్నది. గడిచిన కొద్ది గంటల క్రితం ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్ కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. రామ జోగయ్య శాస్త్రి రాసిన.. డూడూడూ అనే పాటను పృథ్వి చంద్ర చాలా అద్భుతంగా పాడారు. భింస్ సేసిరోలియో ఈ పాటకి అద్భుతమైన మ్యూజిక్ను అందించారు. రవితేజ ఈ పాటలో అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్ కనబరిచినట్లు ఈ లిరికల్ వీడియోలో తెలుస్తోంది.

ధమాకా చిత్రంలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఒకటి మధ్యతరగతి వ్యక్తిగా.. మరొకటి డబ్బున్న వ్యక్తిగా నటిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది . ముఖ్యంగా రవితేజ పూర్వపు ఎనర్జీ తో నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ధమాకా చిత్రం సక్సెస్ కావాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రావు రమేష్ , ఆలీ, హైపర్ ఆది తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తూ ఉన్నారు.

ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్, ప్రసన్నకుమార్ బెజవాడ అందించారు. కొరియాగ్రాఫర్ విషయానికి వస్తే శేఖర్ వి జె, జానీ మాస్టర్ అందిస్తూ ఉన్నారు. ఇక ధమాకా టీజర్, పోస్టర్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో వైరల్ గా మారుతుంది. మరి ఈ చిత్రంతో రవితేజ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నారు.